Harsha Bhogle: క్రికెట్ చూసే అభిమానికి క్రికెట్ కి సంబంధించిన విషయాలు గాని ఆ మ్యాచ్ కి సంబంధించిన వివరాలు గానీ తెలియాలంటే కామెంటర్ చెప్పే కామెంటేటరి వింటూ ఉంటాం. అందులో కొంతమంది కామెంట్రీ చెప్తుంటే అలాగే వింటూ ఉండాలి అనిపిస్తుంది అందులో ముఖ్యమైన అతను మన ఇండియా కి చెందిన హర్ష బోగ్లే ఈయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన తన కామెంట్రీ తో జనాలని అలరిస్తూ వస్తూనే ఉన్నారు అయితే ఈయన కామెంటర్ గా దాదాపు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు.
అయితే ఆయన మొదటగా ఎప్పుడు ఎక్కడ కామెంట్రీ చేశాడు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హర్ష భోగ్లే దాదాపు 40 సంవత్సరాల క్రితం తన తొలి మ్యాచ్ కి కామెంట్రీ చెప్పాడు ఆ రోజుల్లో ఆయన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దూరదర్శన్ లోని ఒక ప్రొడ్యూసర్ అతనికి కామెంటర్ గా అవకాశం ఇచ్చాడు అని చెప్పాడు.ఇక హైదరాబాద్ లో 1983లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ కి తను వ కామెంటర్ గా చేయడం జరిగింది అదే అతనికి మొదటి కామెంట్రీ చేసిన మ్యాచ్ గా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వరుసగా రెండు వన్డేలకి, ఒక టెస్ట్ మ్యాచ్ కి కామెంట్రి చేసే అవకాశాన్ని అందుకున్నాడు అయితే ఆయన 40 సంవత్సరాల క్రితం 10/9/1983 తన మొదటి మ్యాచ్ కి కామెంట్రీ చేశాడు. దాంతో ఈ మధ్య ఆయన తనకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి కృతజ్ఞతలను కూడా తెలియజేశాడు. ఈ క్రమంలో హర్ష భోగ్లే మాట్లాడుతు కామెంటర్ గా చేసినప్పుడు అతను అందుకున్న మొదటి జీతం 350 రూపాయలు అని చెప్పాడు…
అయితే హర్ష భోగ్లే చేసినంత బాగా కామెంట్రీ ఇప్పటివరకు ఎవరు చేయలేరు అనే చెప్పాలి. ఆయన ఏ విషయాన్ని అయిన చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా వివరిస్తూ చెప్తూ ఉంటారు.అందుకే ఆయన ఎక్కువ కాలం పాటు కామెంటర్ గా చేస్తూ ఉండిపోయారు.ఈ క్రమం లో ఆయనకి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉండేవి ఒక మ్యాచ్ అయిపోగానే మరో మ్యాచ్ కి కామెంటరీ చేయడినికి అవకాశాలు రెఢీ గా ఉండేవి…