Bigg Boss Season 7 Day 9: బిగ్ బాస్ సీజన్ 7 మంగళవారం ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం… సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కొనసాగింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని అత్యధికంగా 8 మంది నామినేట్ చేశాడు. బయట ఒక సామాన్యుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ హౌస్లో అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాడు. గేమ్ ఆడటం లేదు. పైగా రైతుబిడ్డను అంటూ సింపథీ కార్ద్ వాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. దీంతో రెండోవారానికి అతడు నామినేట్ అయ్యాడు.
ఈ నామినేషన్స్ లో శోభా శెట్టి-శివాజీ మధ్య వాగ్వాదం నడిచింది. నువ్వు నన్ను నామినేట్ చేశావ్, నేను నిన్ను చేశాను అంతకంటే రీజన్ లేదని శివాజీ అన్నాడు. ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు. సిల్లీ రీజన్ తో నామినేట్ చేయడమేంటని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ సీరియస్ గా వాదించుకున్నారు. ఇక రెండో వారానికి గాను ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, షకీలా, శోభా శెట్టి, తేజా, శివాజీ, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
అనంతరం బిగ్ బాస్ మాయాస్త్ర టాస్క్ నిర్వహించాడు. ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించాడు. రణధీర టీంలో అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ, షకీలా ఉన్నారు. వీరి ప్రత్యర్థి టీమ్ మహాబలిలో టేస్టీ తేజా, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, దామిని, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ ఉన్నారు. ఆట సందీప్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ రెండు టీమ్స్ మాయస్త్ర కోసం పోటీపడాల్సి ఉంది. గెలిచిన టీమ్ కి మాయాస్త్ర పొందే తాళం దక్కుతుంది.
మొత్తం రణధీర-మహాబలి టీమ్స్ మధ్య మూడు రౌండ్స్ జరిగాయి. ప్రతి రౌండ్ లో రణధీర టీమ్ విజయం సాధించింది. దాంతో మాయాస్త్ర పొందే తాళం రణధీర టీమ్ కి దక్కింది. మాయాస్త్ర పొందిన టీమ్ మెంబర్స్ లో ఒకరికి పవర్ అస్త్ర దక్కుతుంది. పవర్ అస్త్ర పొందినవారికి 5 వారాలు ఎలిమినేషన్ ఉండదు. విఐపీ రూమ్ దక్కుతుంది. కాబట్టి రణధీర టీమ్ లో ఉన్న ఒకరికి పవర్ అస్త్ర దక్కుతుంది. కాగా రణధీర టీమ్ గెలుచుకున్న మాయాస్త్ర తాళంని దొంగిలించే ప్రయత్నం జరిగింది. ఇలా గత ఎపిసోడ్ ముగిసింది…