Women’s Premier League 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ కు సంబంధించి కౌంట్ డౌన్ దాదాపు మొదలైనట్టే. దీని కంటే ముందు మెగా వేలం జరగనుంది.. మెగా వేలాని కంటే ముందు ఆయా యాజమాన్యాలు ప్లేయర్లను తమ వద్ద అంటి పెట్టుకుంటాయి.. అలా ఉంచుకొనే ప్లేయర్ల జాబితాలో యాజమాన్యాలు బయటికి విడుదల చేశాయి.. ఒక్కో యాజమాన్యం గరిష్టంగా ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత ప్లేయర్లు.. ఇద్దరు విదేశీ ప్లేయర్లు కచ్చితంగా ఉండాలి.. బిసిసిఐ రూపొందించిన నిబంధన ప్రకారం ఇందులో 3.5 కోట్లు, 2.5 కోట్లు, 1.75 కోట్లు, ఒక కోటి, 50 లక్షల చొప్పున 5 స్లాట్లు ఉంటాయి.. ఈ ప్రకారం ఒక్కో యాజమాన్యం తమ పర్సులో ఉన్న 15 కోట్ల నుంచి 9.25 కోట్ల వరకు గరిష్టంగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
Also Read: ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన టీమిండియా.. ఇదీ సూర్య భాయ్ వ్యూహ చతురత!
ముంబై ఇండియన్స్..
ఈ జట్టు ఈసారి ఆశ్చర్యానికి గురిచేసింది.. హర్మన్ ప్రీత్ ను పక్కనపెట్టి బ్రాంట్ కు భారీగా కేటాయించింది. బ్రాంట్(3.5 కోట్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (2.5 కోట్లు), హేలీ(1.75 కోట్లు), అమన్ (ఒక కోటి), కమిలిని (50 లక్షలు) జట్టులో ఉంచుకుంది. ముంబై జట్టు పర్సులో మొత్తం 5.75 కోట్లు ఉన్నాయి.
బెంగళూరు
స్మృతి (3.5 కోట్లు), రిచా (2.75 కోట్లు), ఎలిసా (2 కోట్లు), శ్రేయాంక పాటిల్(60 లక్షలు) రిటైన్ చేసుకుంది. బెంగళూరు ఖాతాలో ఇంకా 6.15 కోట్లు ఉన్నాయి.
ఢిల్లీ
జెమీమా(2.2కోట్లు), షేఫాలి వర్మ (2. 2 కోట్లు), అన్నాబెల్ సదర్ ల్యాండ్ (2.2 కోట్లు), కాప్(2.2 కోట్లు), నికి ప్రసాద్(50 లక్షలు) ను రిటైన్ చేసుకుంది. వీరి ఖాతాలో ఇంకా 5.7 కోట్లు ఉన్నాయి.
గుజరాత్
గార్డెనర్(3.5 కోట్లు) బెట్ మునీ(2.5 కోట్లు) ను రిటైన్ చేసుకుంది. వీరి పర్స్ లో 9 కోట్లు ఉన్నాయి.
యూపీ వారియర్స్
శ్వేత (50 లక్షలు) మాత్రమే రిటైన్ చేసుకుంది. వీరి పర్స్ లో 14.5 కోట్లు ఉన్నాయి.
మెక్ లానింగ్, సోఫీ, దీప్తి శర్మ, హీలీ, లారా ను ఆయా యాజమాన్యాలు విడుదల చేశాయి. వీరు మెగా వేలంలో పాల్గొంటారు.. స్పోర్ట్స్ వర్గాల అంచనా ప్రకారం లారాకు, దీప్తి శర్మ కు భారీ ధర లభించే అవకాశం ఉంది.