https://oktelugu.com/

Hardik Pandya: క్రికెట్ లో సిక్స్ ఇలా కూడా కొడతారా?.. హార్థిక్ భయ్యా.. నీ ఆటిట్యూడ్ కి ఓ దండం..

బంగ్లాదేశ్ జట్టుతో గ్వాలియర్ మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ వైపు మొగ్గు చూపింది. దీంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 7, 2024 / 11:42 AM IST

    Hardik Pandya stands ice-cold after insane no look shot

    Follow us on

    Hardik Pandya: సమకాలీన క్రికెట్లో ఒక్కో ఆటగాడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆడే విధానంలో తమ మేనరిజం తో ఆటగాళ్లు ఆకట్టుకుంటారు. అయితే ప్రస్తుత టి20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. ఎందుకంటే అతడు మిస్టర్ 360 గా పేరు పొందాడు. మైదానం నలుమూలల అతడు షాట్లు కొడతాడు. కానీ హార్దిక్ పాండ్యా సూర్య కుమార్ యాదవ్ ను మించి పోయేలా కనిపిస్తున్నాడు.

    బంగ్లాదేశ్ జట్టుతో గ్వాలియర్ మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ వైపు మొగ్గు చూపింది. దీంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. భారత బౌలర్లు ధాటికి బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బంగ్లా ఆటగాళ్లలో హసన్ మిరాజ్ 35 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. హార్థిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 128 పరుగుల విజయ లక్ష్యం తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. ఆడుతూ పాడుతూ టార్గెట్ ఫినిష్ చేసింది. 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఈ గెలుపు ద్వారా 3 t20 ల సిరీస్ ను భారత్ 1-0 తేడాతో ముందుంజ వేసింది. తదుపరి టి20 మ్యాచ్ ఢిల్లీ వేదికగా అక్టోబర్ 10న జరుగుతుంది.

    బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో భారత్ ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16) , సంజు శాంసన్(29) పరుగులు చేసి ఆకట్టుకున్నారు. అభిషేక్ శర్మ రన్ అవుట్ కావడంతో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29) క్రీజ్ లోకి వచ్చాడు. ఉన్నంత సేపు ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. అతడు అవుతున్న తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (16) బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు కూడా ధీటుగా ఆడాడు. ఆ తర్వాత సంజు శాంసన్ అవుట్ కావడంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చాడు. రావడమే ఆలస్యం తన విశ్వరూపాన్ని బంగ్లా ఆటగాళ్లకు చూపించాడు. బంతిమీద దీర్ఘకాలం విరోధం ఉన్నట్టుగా కసి కొద్ది కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో గ్వాలియర్ మైదానాన్ని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో తన ఆటిట్యూడ్ ను ప్రదర్శించాడు.. నో లుక్ సిక్స్ టైప్ లో షాట్ కొట్టి.. వారెవా అనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.

    సంజు అవుటయిన తర్వాత

    భారత ఇన్నింగ్స్ లో భాగంగా సంజు అవుట్ అయిన తర్వాత హార్దిక్ మైదానంలోకి వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంగ్లా బౌలర్ తస్కిన్ 12 ఓవర్ మూడో బంతిని బౌన్సర్ లాగా సంధించాడు. ఆ బంతి వైపు చూడకుండానే హార్దిక్ జస్ట్ బ్యాట్ అలా అడ్డు పెట్టాడు. ఆ తర్వాత బంతి ఎటువైపు వెళ్ళిందో కూడా అతడు చూడలేదు. ఆ బంతి నేరుగా బౌండరికి తగిలింది. ఈ షాట్ గ్వాలియర్ ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఈ షాట్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 16 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.. హార్దిక్ పాండ్యా దూకుడు వల్ల భారత్ 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించడం విశేషం. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ హార్దిక్ సత్తా చాటాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. 26 పరుగులు సమర్పించుకొని, ఒక వికెట్ పడగొట్టాడు.