Hardik Pandya: కొంతకాలంగా గాయంతో బాధపడుతూ.. కీలకమైన మ్యాచ్ లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు.. త్వరలో టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో.. అతడు మైదానంలో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. అతని ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ‘అఖండ 2’ మూవీ ఫస్ట్ రివ్యూ…బొమ్మ ఎలా ఉందంటే..?
జాతీయ జట్టులోకి రావాలనుకునే ఆటగాళ్లు కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాలని మేనేజ్మెంట్ నిబంధన విధించింది. మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు పలువురు క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు. అందులో హార్దిక్ పాండ్యా కూడా ఒకడు. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టబోతున్నాడు. తనను తాను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బరోడా జట్టు తరఫున అతడు రంగంలోకి దిగుతున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ఆడబోతున్నాడు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో హార్దిక్ గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. సెప్టెంబర్ 22న అతడు చివరి మ్యాచ్ శ్రీలంక జట్టుతో ఆడాడు. కండరాల గాయం వల్ల తప్పుకున్నాడు. దీంతో కొంతమేర విశ్రాంతి కావాలని భావించిన అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రంలో చికిత్స పొందాడు. దీపావళి సెలవులు మినహా నవంబర్ 29 వరకు అతడు అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం అతడు సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ చేయడంలో పూర్తి ఫిట్ గా ఉన్నాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చింది. దాదాపు 40 రోజుల పాటు అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నాడు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం పాండ్యా డిసెంబర్ 4 న గుజరాత్ జరిగే మ్యాచ్ లో ఆడాలి. అతడి ఆటను, సామర్ధ్యాన్ని పరీక్షించాలని బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా బీసీసీఐ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓఝా హార్దిక్ ఆట తీరును స్వయంగా పర్యవేక్షిస్తాడు. మరోవైపు దక్షిణాఫ్రికా తో జరిగే 5 టి20 మ్యాచ్ ల సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ప్రదర్శన కీలకంగా ఉంది.
ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రదర్శన కీలకం కానుంది. ఆదివారం జింఖానా మైదానంలో బెంగాల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు తనకు అచ్చి వచ్చిన ఉప్పల్ మైదానంలో అభిషేక్ దుమ్మురేపుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్ లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 32 బంతుల్లో సెంచరీ చేశాడు. హార్దిక్, కృణాల్ పాండ్యా మినహా మిగతా వారంతా బరోడా జుట్టులో అంతగా అనుభవం లేని బౌలర్లు ఉన్నారు. ఈ ప్రకారం వారిని అభిషేక్ శర్మ ఒక ఆట ఆడుకోవడం ఖాయం.