Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya: పంజాబ్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా.. మరి అయ్యర్ పరిస్థితి ఏంటి..

Hardik Pandya: పంజాబ్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా.. మరి అయ్యర్ పరిస్థితి ఏంటి..

Hardik Pandya: టీమ్ ఇండియా టి20 సారథిగా ఇటీవలే కదా అయ్యర్ కు ప్రమోషన్ లభించింది. అది జరిగి మూడు రోజులు కూడా కావడం లేదు. అంతలోనే అతడికి బ్యాడ్ న్యూస్.. నిజమే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అలా ఉంది మరి. ఎందుకంటే ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న అతడు.. తన స్థానాన్ని కోల్పోయే అవకాశం కల్పిస్తోంది. అతడు వేరే జట్టుకు ట్రేడ్ విధానంలో వెళ్లిపోయే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం ముంబై జట్టు నుంచి హార్దిక్ పాండ్యా వెళ్లి పోతాడని తెలుస్తోంది. అతడు పంజాబ్ జట్టుకు ఒక మూడు సీజన్ల పాటు సారధిగా ఉంటాడని సమాచారం. ఇప్పటికే ప్రీతి జంట అతడికి బ్లాంక్ ఇచ్చిందని.. దానికి అతడు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇటీవల టి20 జట్టులో హార్దిక్ పాండ్యా చోటు కోల్పోయాడు. అంతకుముందు ఐపీఎల్ లో ముంబై జట్టు సారధిగా అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ముంబై మేనేజ్మెంట్ కూడా అతని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం గా ఉందని ప్రచారం జరుగుతుంది. అందువల్లే అతడిని పక్కనపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

ముంబై మేనేజ్మెంట్ అయ్యర్ మీద ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. అయ్యర్, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, చాహల్ మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయ్యర్ కూడా ముంబై జట్టుకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయ్యర్ ఢిల్లీ జట్టును ఒకసారి ఫైనల్ గా తీసుకెళ్లాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టును ఫైనల్ గా తీసుకెళ్లాడు. అంతకుముందు కోల్కతాను విజేతగా చేశాడు. అతడికి ఐపీఎల్లో విజయవంతమైన చరిత్ర ఉంది. అందువల్లే ముంబై మేనేజ్మెంట్ అతని మీద ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉండాలని నీతా అంబానీ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలు వడుతుందని సమాచారం.

హార్థిక్ పాండ్యా గతంలో జీటీ నుంచి ట్రేడ్ విధానంలోనే ఎంఐ జట్టుకు వచ్చాడు. ముంబై జట్టుకు 2024 నుంచి నాయకత్వం వహించడం మొదలుపెట్టాడు. అతడి నాయకత్వంలో ముంబై జట్టు 2025లో నాలుగో స్థానంలోకి వెళ్ళింది. ఈ సీజన్లో.. 2024 సీజన్లో అంతగా ఆకట్టుకోలేదు. పైగా వ్యక్తిగతంగా హార్దిక్ ప్రదర్శన కూడా అంత బాగోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version