Rohit Sharma: ముంబై ఇండియన్స్ టీం లో కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపైన రోజుకొక న్యూస్ బయటికి వస్తుంది. ఇప్పటికే ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్య ని 2024 సీజన్ నుంచి కెప్టెన్ గా కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యం తో అతన్ని గుజరాత్ టైటాన్స్ టీమ్ నుంచి ట్రేడింగ్ విధానం ద్వారా తీసుకున్నారు. ఇక రీసెంట్ గానే ముంబై యాజమాన్యం 2024 నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా తన సేవలు అందిస్తాడు అంటూ ప్రకటించింది.
అయినప్పటికీ హార్థిక్ పాండ్య కి వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మీద ఆడిన మ్యాచ్ లో గాయం అవడం వల్ల ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు గాయం కారణంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక మధ్యలో ఆ గాయం తీవ్రత తగ్గినప్పటికీ ప్రాక్టీస్ సేషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకి ఆ గాయం తిరగబెట్టడంతో తను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇప్పటికి కూడా ఆయన గాయం నుంచి రికవరీ అవ్వలేదు. ఇక ఇప్పటివరకు జనవరిలో అప్ఘనిస్తాన్ తో జరిగే టి20 సిరీస్ లో హార్దిక్ పాండ్య టీమ్ లోకి వస్తాడు అని బిసిసిఐ ప్రకటించినప్పటికీ తను మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోనట్టుగా తెలుస్తుంది. అందువల్లే తను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక అందులో భాగం గానే హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది అంటూ పిటిఐ పేర్కొంది. దాంతో ఆయన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తో పాటు ఐపీఎల్ కి కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇదే జరిగితే ముంబై టీం కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు అంటూ మరికొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రోహిత్ అభిమానులు కొంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే రోహిత్ శర్మ ని కెప్టెన్ గా ఇక మీదట మనం చూడలేము అనే భావనలో ఉన్న వాళ్లకి ఈ న్యూస్ అనేది కొంతవరకు ఊరట నిచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి హార్దిక్ పాండ్యా గాయంతో కోలుకొని ఐపిఎల్ వరకు వస్తాడా లేకపోతే ఆయన ప్లేస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడా అనే విషయాల మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ హార్దిక్ పాండ్య రాకపోతే మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు అని అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…