Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు సాధిస్తాయి. పాన్ ఇండియా రేంజ్ లో నటించకపోయినా ఆ సినిమాలకు వచ్చే వసూళ్లను సంపాదిస్తుంటారు మిల్క్ స్టార్. అందుకే మహేష్ బాబు లెవల్ వేరే అంటుంటారు అభిమానులు. ఎన్ని పాన్ ఇండియా సినిమాల్లో నటించిన రాని క్రేజ్ మహేష్ బాబుకు వస్తుంటుంది. రీసెంట్ గా వచ్చిన ఆయన సినిమాలను చూస్తే ఇది ఎవరికి అయినా అర్థం అవుతుంటుంది.
ఇక మహేష్ బాబు సినిమాలకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పవచ్చు. సస్పెన్స్, ఫ్యామిలీ వంటి సినిమాల్లో నటిస్తూ ఎన్నో సంవత్సరాలుగా తన పేరు నిలబెట్టుకున్నారు. నెగటివ్ లేకుండా నటిస్తుంటారు ఈ స్టార్ హీరో. ఈ క్రేజ్ మహేష్ కు కలెక్షన్ల రూపంలో వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే కాదు బుల్లితెర రికార్డ్స్ లో కూడా మహేష్ బాబుకు సూపర్ క్రేజ్ ఉంది. ఈయనకు పోటీ కూడా ఇతర హీరోలు రారు అంటూ కామెంట్స్ చేస్తుంటారు మహేష్ అభిమానులు.
టీవీలో ప్రసారమైన మహేష్ సినిమాల లిస్ట్ తీసుకుంటే ప్రతి సినిమాకు ఓ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది. మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు రాకున్నా రెండవ సారి లేదా ఆ తర్వాత రిపీట్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ గా రేటింగ్స్ వస్తుంటుంది. సరిలేరు నీకెవ్వరూ, మమర్షి సినిమాలకు ఊహించని రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ రావడమే కాదు ఏకంగా రూ. 200 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టాయట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీని ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రావడానికి సిద్దమైంది ఈ సినిమా. మరి ఈ సినిమా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులు మరింత హోప్స్ పెట్టుకున్నారు. సర్కారు వారి పాట సినిమా ఆశించిన ఫలితాలను అందించకపోవడంతో గుంటూరు కారం కోసం ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు.