Arshin Kulkarni: ఇండియన్ టీం లో బ్యాట్స్ మెన్స్, బౌలర్లు పుష్కలంగా ఉన్నప్పటికీ మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ అద్భుతమైన బ్యాటింగ్ చేసే ఆ రౌండర్ ప్లేయర్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.అందులో కొందరు మాత్రమే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంటూ అద్భుతంగా రాణిస్తూ ఇండియన్ టీమ్ తరపున ఆడుతున్నారు అలాంటి వాళ్లలో హార్దిక్ పాండ్య ఒకడు. ఇక హార్దిక్ పాండ్య లేని లోటు మొన్న వన్డే వరల్డ్ కప్ లో మనకు స్పష్టంగా కనిపించింది. ఇండియన్ టీం లో మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ అద్భుతమైన బ్యాటింగ్ చేసే ఆల్ రౌండర్ ప్లేయర్ ఆయన ఒక్కడే ఉండటం వల్ల ఆయనను రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరూ లేకపోవడం వల్ల ఆయన గాయాల బారిన పడినప్పుడు ఆయన లేని లోటును తీర్చే ప్లేయర్లు ఎవరు దొరకడం లేదు కానీ ఇప్పుడు మాత్రం హార్దిక్ పాండ్య ని రీప్లేస్ చేసే ప్లేయర్ ఒకడు ఇండియన్ టీం కి దొరికాడు.ఆయన ఎవరు అంటే అర్షిన్ కులకర్ణి…
ఈయన అద్భుతమైన మీడియం పేస్ బౌలింగ్ వేస్తూ బ్యాటింగ్ లో కూడా సత్తా చాటుతూ తొందరలోనే ఇండియన్ టీం కి ఎంట్రీగా ఇవ్వబోతున్న కుర్ర ప్లేయర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఈయన అచ్చం హార్దిక్ పాండ్య మాదిరిగానే బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలో రాణిస్తూ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు…
ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ లో ఇండియన్ టీం తరుపున కెప్టెన్ గా అర్షిన్ కులకర్ణి వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ టోర్నీలో ఆఫ్గనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లో కూడా 70 పరుగులు చేసి అజయంగా నిలిచి ఇండియన్ టీం కి ఏషియా కప్ లో మొదటి విజయాన్ని అందించాడు. ఇక దాంతో ఈ ప్లేయర్ పైన అందరి దృష్టి పడింది. ఇక దాంతో ఈ ప్లేయర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారు…
18 సంవత్సరాల కులకర్ణి మహారాష్ట్రలోని సోలాపూర్ లో జన్మించాడు. ఈయన తండ్రి అతుల్ కులకర్ణి ఈయన ఒక డాక్టర్… అయితే అతుల్ కులకర్ణి కూడా మొదట్లో క్రికెటర్ అవుదాం అనుకున్నాడు కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో క్రికెటర్ అవ్వాలనే ఆశయాన్ని వదులుకొని డాక్టర్ అయ్యాడు…ఇక తను నెరవేర్చలేని తన కలని తన కొడుకు రూపంలో నెరవేర్చుకుంటున్నాడు… ఇక ఇదే సమయంలో చిన్నప్పటి నుంచి ఆర్షివ్ కులకర్ణికి అతుల్ కు క్రికెట్ కి సంబంధించిన మెలకువలను నేర్పుతూ వచ్చాడు
అయితే అర్షిన్ మొదటగా సోలాపూర్ లో క్రికెట్ కు సంబంధించిన మేలుకోవలను నేర్చుకొని అక్కడ నుంచి మహారాష్ట్ర తరపున అండర్ 14 చోటు సంపాదించుకున్నాడు. ఇక ఎప్పుడైతే అండర్ 14 లో అర్షిన్ కి అవకాశం దక్కిందో అప్పటినుంచి తన ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ నాన్న పూనేకి షిఫ్ట్ చేశాడు.కాడెన్స్ అకాడమీలో అర్షిన్ స్కిల్స్ నేర్చుకొని బ్యాటింగ్ బౌలింగ్లో తనకంటూ సహజత్వాన్ని సంపాదించుకున్నాడు. అలా తను ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ వచ్చాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ తరఫున తను వెలుగులోకి వచ్చాడు ఇక ప్రస్తుతం అండర్ 19 లో తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ముఖ్యంగా అండర్ 19 కెప్టెన్ గా ఎదిగి ఆసియా కప్ లో ఇండియన్ టీం కి మొదటి విజయాన్ని అందించడం తో తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది…
క్రికెట్ ఆడుతూనే చదువులో కూడా తన సత్తాను చాటుతూ వస్తున్నాడు నాలుగు రోజులు స్కూలుకెళ్తూ మిగిలిన రోజుల్లో క్రికెట్ ఆడుతూ అటు క్రికెట్ ని, ఇటు చదువును బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు… తనకి ఫేవరెట్ క్రికెటర్ అయిన హార్దిక్ పాండ్యని కూడా కలిసి తన దగ్గర కొన్ని మెలకువలను కూడా తీసుకున్నాడు.ఇక అర్షిన్ కులకర్ణి గురించి తెలుసుకున్న క్రికెట్ అభిమానులు అందరూ ఫ్యూచర్ హార్దిక్ పాండ్య అంటూ తనపైన పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు…