Hardik Pandya Mumbai Indians: 2022లో గుజరాత్ జట్టును ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించేలా చేశాడు హార్థిక్ పాండ్యా. మరుసటి సంవత్సరం గుజరాత్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫలితంగా హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా డిమాండ్ పెంచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ సెర్చింగ్ ప్లేయర్ గా ఆవిర్భవించాడు. ఈ దశలో తమ జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ను సైతం వదులుకుంది ముంబై ఇండియన్స్.
హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకుంది. 2024లో అతడిని ముంబై జట్టుకు సారధిగా నియమించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గుజరాత్ మాదిరిగా ముంబై జట్టు అతడి నాయకత్వంలో విజయాల బాట పట్టలేకపోతోంది. 2024 సీజన్లో ఏకంగా ముంబై జట్టు పాయింట్లు పట్టికలో అధమ స్థానంలో ఉంది. 2025లో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అయితే దారుణమైన స్థితిలో ఉంది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు ఆశించిన స్థాయిలో ఆడ లేకపోతోంది.
హార్దిక్ పాండ్యా బంతితో ఆకట్టుకోవడం లేదు. బ్యాట్ తో సత్తా చూపించడం లేదు. దీంతో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబై జట్టు కీలకమైన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ముంబై మేనేజ్మెంట్ తీవ్ర ఆగ్రహంగా ఉందని వార్తలు వస్తున్నాయి. మ్యాచ్ మధ్యలోనే ముంబై జట్టు యజమాని ఆకాష్ అంబానీ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా వాతావరణం అంత సానుకూలంగా లేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు 5 ట్రోఫీలు అందుకుంది. దారుణమైన పరాజయాలు కూడా చవిచూసింది. కానీ ఈనాడు కూడా ఈ స్థాయిలో జట్టు పరువు తీసుకోలేదు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా జట్టును గొప్ప మార్గంలో నడిపించకపోగా.. అంతగా ఆకట్టుకునే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించకుండా విఫలమవుతున్నాడు.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హార్దిక్ పాండ్యాను జట్టు సారధిగా తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ముంబై జట్టు యాజమాన్యం ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కాకపోతే మేనేజ్మెంట్ వ్యవహార శైలి అదే విధంగా ఉందని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే.. వరుస విజయాలు సాధించాలి. అప్పుడే ప్లే ఆఫ్ దాకా వెళుతుంది. లేకపోతే మాత్రం ముంబై జట్టు 2024 లాగానే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.