Hardik Pandya: ఆసియా కప్..సూపర్_ 4 లో భాగంగా శ్రీలంకలోని ప్రేమ దాస స్టేడియంలో భారత్_ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ (122), కేఎల్ రాహుల్ (111), గిల్(58), రోహిత్(56) రాణించారు.. కోహ్లీ, రాహుల్ నాట్ అవుట్ గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 32 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్.. ఏ దశలోనూ భారత జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది.
హోరహోరిగా సాగుతుంది అనుకున్న మ్యాచ్.. పూర్తి ఏకపక్షంగా మారింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ పరుగులు తీసేందుకే ఆపసోపాలు పడ్డారు.. ఒక బ్యాట్స్మెన్ కూడా రెండు అంకెల స్కోర్ సాధించేందుకు ముందుకు రాలేదు అంటే వారి ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఒకానొక దశలో 100 పరుగులు చేస్తారా లేదా అనేది అనుమానం నెలకొంది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆడుతున్న తీరు పట్ల మైదానంలో ఉన్న ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరైతే ఫ్ల కార్డులు చేతిలో పట్టుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు తరఫున కులదీప్ యాదవ్ ఐదు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది మాత్రం బాబర్ అజం వికెట్.
పాకిస్తాన్ జట్టు స్కోరు 10.4 ఓవర్లలో 43 గా ఉన్నప్పుడు.. ఒక ఎండ్ లో ఫఖార్ ఉన్నాడు. మరో ఎండ్ లో బాబర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో బంతిని చేతిలోకి తీసుకున్న హార్దిక్.. అద్భుతమైన బంతితో బాబర్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బంతిని నిర్దిష్టమైన వేగంతో విసిరిన హార్దిక్.. దానిని ఇన్ స్వింగ్ చేశాడు. అయితే బంతి పడే మార్గాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిన బాబర్ ముందుగానే బ్యాట్ ను కదిలించాడు. అయితే బంతి అతడి అంచనా తప్పి వికెట్లను గిరాటేసింది. దీంతో బాబర్ ముఖంలో నైరాశ్యం అలముకుంది. భారత జట్టు ఆటగాళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై భారతీయ అభిమానులు రకరకాల కామెంట్ చేస్తున్నారు. అది బంతి కాదు.. హార్దిక్ విసిరిన బుల్లెట్.. దెబ్బకు బాబర్ వికెట్లను గిరాటేసింది..అని కామెంట్లు చేస్తున్నారు.
What a delivery by hardik pandya
Pakistani captain Babar Azam out#IndiaVsPakistan
❤️❤️ pic.twitter.com/oaGqChpd9A— यादव गौरव (@Gauravy1008) September 11, 2023