India vs Pakistan : ఆ వికెట్లు తీసి మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పిన పాండ్య,శార్ధుల్ టాకుర్…

బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ లని చెప్పుకుంటారు వీళ్ళిద్దరిని ఔట్ చేసి అటు హార్దిక్ పాండ్య,ఇటు శార్ధుల్ టాకుర్ ఇద్దరు కూడా మ్యాచ్ ని మలుపు తిప్పారు అనే చెప్పాలి...

Written By: NARESH, Updated On : September 11, 2023 10:11 pm

Sri-Lanka-Asia-Cup-Cricket-79_16

Follow us on

India vs Pakistan : ఏషియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో ఈరోజు రిజర్వ్ డే లో ఉన్నాడు వల్ల నిన్న మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలైంది. ఇండియా బ్యాటింగ్ కి వచ్చింది అయితే మన బ్యాట్స్ మెన్స్ అయిన రాహుల్, కోహ్లీ ఇద్దరు కూడా మొదటి నుంచే ఎదురు దాడి కి దిగుతూ పాకిస్థాన్ బౌలర్ల కి చుక్కలు చూపించారు. ఇక ఆందులో భాగంగానే మన టీమ్ నిర్ణీత 50 ఓవర్లకీ 2 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది ఇక కోహ్లీ, రాహుల్ ఇద్దరు కూడా సెంచరీ లు చేసి నాటౌట్ గా నిలిచారు నిజానికి వీళ్లిద్దరూ లేకపోతే ఇండియా టీమ్ చాలా కష్టాల్లో పడేది… ఇక 357 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన పాకిస్థాన్ టీమ్ కి బుమ్రా పెద్ద షాక్ ఇచ్చాడు.18 బంతుల్లో 9 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ ని బుమ్ర తన స్వింగ్ బౌలింగ్ తో మొదట ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఆయన వికెట్ కూడా తీశాడు…

ఇక ఆ తర్వాత క్రేజ్ లోకి వచ్చిన బాబర్ అజమ్ కూడా మన బౌలర్ల బౌలింగ్ ని ఎదురుకోవడం లో చాలా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే మన బౌలర్లు వేసిన ప్రతి బాల్ కూడా టచ్ చేస్తే క్యాచ్ ఔట్ అయిపోతాం ఏమో అనేంత స్వింగ్ చేస్తూ మనవాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇక నిదానంగా ఆడుతున్న బాబర్ అజమ్ 24 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 10 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఇక బాబర్ అజమ్ క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు అనుకున్న టైమ్ లో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య కి బౌలింగ్ ఇచ్చి మంచి పని చేశాడు…వచ్చి రాగానే హార్దిక్ తన బాల్స్ తో బాబర్ అజమ్ ని ఇబ్బంది పెట్టి మొత్తానికి అయితే ఒక ఆఫ్ కట్టర్ వేసి బాబర్ అజమ్ ని బౌల్డ్ చేశాడు…నిజానికి హార్దిక్ పాండ్య ఆ వికెట్ తీసి మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు అనే చెప్పాలి.ఎందుకంటే ప్రస్తుతం వన్డే క్రికెట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న బాబర్ అజమ్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఆయన కనక ఒకసారి క్రీజ్ లో స్టాండ్ అయితే ఇక ఎవ్వరికీ అవుట్ అవ్వడు మ్యాచ్ గెలిచేదాకా క్రీజ్ లోనే ఉంటాడు అందుకే హార్దిక్ పాండ్య ఆయన వికెట్ తీసి మంచి పని చేశాడు…

ఇక కొద్దిసేపు వర్షం కారణం గా మ్యాచ్ నిలిచిపోయింది.ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ స్టార్ట్ అయింది అప్పుడు కరెక్ట్ గా శార్ధుల్ టాకుర్ బౌలింగ్ చేసి మహమ్మద్ రిజ్వన్ వికెట్ తీశాడు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ లో మోస్ట్ డెంజెరెస్ ప్లేయర్లు గా బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ లని చెప్పుకుంటారు వీళ్ళిద్దరిని ఔట్ చేసి అటు హార్దిక్ పాండ్య,ఇటు శార్ధుల్ టాకుర్ ఇద్దరు కూడా మ్యాచ్ ని మలుపు తిప్పారు అనే చెప్పాలి…