spot_img
Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya missing: కనిపించని హార్దిక్..ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య.. ఏమైనా ప్లాన్ చేశారా...

Hardik Pandya missing: కనిపించని హార్దిక్..ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య.. ఏమైనా ప్లాన్ చేశారా భయ్యా

Hardik Pandya missing: ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తల పడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు సారథి అక్షర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ వేసే ప్రక్రియలో అక్షర్ తో కలిసి సూర్య కుమార్ యాదవ్ హాజరయ్యాడు. దీంతో మైదానంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

2024 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు రోహిత్ ముంబై జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. ముంబై జట్టును అతడు ఐదుసార్లు విజేతగా నిలిపాడు. గడచిన కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ సరిగా ఆడలేక పోతోంది. దీంతో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.

హార్దిక్ పాండ్యా నాయకత్వంలో 2024లో ముంబై ఇండియన్స్ అంతగా ఆకట్టుకోలేదు. 2025లో మాత్రం ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. 2026 లో తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఉరిమే ఉత్సాహంతో రెండవ మ్యాచ్ ఢిల్లీ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది.

Also Read: 22 బంతుల్లో 28 పరుగులు.. నువ్వు ధోని వారసుడివా.. ఇలా అయితే సీఎస్కే ట్రోఫీ గెలిచినట్టే

హార్థిక్ పాండ్యా కనిపించకపోవడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టిందని కొంతమంది అంటుంటే.. వ్యక్తిగత కారణాలవల్ల అతడు మ్యాచ్ కు దూరమయ్యాడని.. తదుపరి మ్యాచ్ కు జట్టులోకి వస్తాడని మరికొందరు అంటున్నారు. గత సీజన్లో హార్దిక్ పాండ్యా గైర్హాజరైన దాఖలాలు లేవు. పైగా గత సీజన్లో అతడు విడాకుల ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అతడు ప్రముఖ మోడల్ మహిక తో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆమెకు ఖరీదైన కారు బహుమతి అందించాడు. హార్దిక్ ఆడుతున్న మ్యాచ్లకు ఆమె హాజరవుతోంది.

హార్దిక్ మొదటి భార్య నటాషా కూడా ప్రస్తుతం ముంబైలోనే కనిపిస్తోంది. ఆమె గురించి కూడా రకరకాల రూమర్స్ వినిపించినప్పటికీ.. అవి నిజం కాదని తేలిపోయింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కుమారుడు మొదటి భార్య నటాషా వద్ద ఉంటున్నాడు. అప్పుడప్పుడు హార్దిక్ పాండ్యా వద్దకు వస్తున్నాడు. హార్దిక్ పాండ్యా తన కుమారుడిని ముద్దు చేస్తున్నాడు. ఇటీవల అతడికి ఖరీదైన కారు బహుమతి అందించాడు. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్ కు దూరమయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు ఢిల్లీతో పోటీ పడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version