Hardhik Pandya: మార్పు నిత్యం.. మార్పు సత్యం.. మార్పు శాశ్వతం… ఇది క్రికెట్ ఆటకు బాగా వర్తిస్తుంది. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది కాబట్టే ఆస్ట్రేలియా ఆటతీరులో అంత వైవిధ్యం ఉంటుంది. ఆ జట్టు కెప్టెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు..ఫామ్ లేమి కారణంగా పక్కన పెట్టారు. టీ20 లో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు. అదే మన జట్టులో.. సాధ్యం అయ్యే పనేనా? టీ20 టోర్నీలో ఇప్పటి వరకూ ఆశించిన మేర ప్రతిభ చూపని అక్షర్ పటేల్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అండదండలు అందించడం గమనార్హం. ఇక ఇదే దశలో కేఎల్ రాహుల్, హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ వంటి వారికి అవకాశాలు కల్పించడం జట్టుకూర్పులో తొలతనాన్ని బట్ట బయలు చేస్తోంది. వాస్తవానికి టి20 అంటేనే ఆట చివరి వరకు హోరాహోరీ పోరాటం.. కానీ నిన్న మన వాళ్ళ బౌలింగ్ చూస్తే మేము ఇక్కడ దాక రావడమే గొప్ప.. ఇక చాలు అన్నట్టుగా ఉంది. ఉదాహరణకి మొన్న నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే టి20 ఎలా ఆడాలో తెలుస్తుంది. పసికూన అయిన నెదర్లాండ్స్ ఏకంగా ప్రోటీస్ జట్టును ఓడించిన తీరు నభూతో నభవిష్యత్తు.
మార్పులు సరే మరి విజయాలు
గత కొంతకాలంగా బీసీసీఐ కెప్టెన్లను మారుస్తూ వస్తోంది.. ఒకరిని కూడా స్థిరంగా ఉంచలేకపోతోంది. ఇది సరైన నిర్ణయం కాదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.. కెప్టెన్ ను మార్చినంత మాత్రాన విజయాలు వెంటనే దక్కవని, ఆటగాళ్ల కూర్పులో వైవిధ్యం చూపినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని సూచిస్తున్నారు. ఆటగాళ్ల పూర్వ ప్రదర్శన దృష్టిలో పెట్టుకొని జట్టులోకి ఎంపిక చేయాలని హితవు పలుకుతున్నారు. ఉపఖండం అవతల మైదానాలు అయినప్పటికీ మిగతా జట్ల ఆటగాళ్లు స్వేచ్ఛగా పరుగులు తీయగలిగినచోట.. మనవాళ్లు తడబడటం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లు పెద్దగా బ్యాటింగ్ చేసిన దాఖలాలు కనిపించలేదు. ఇక విజయం లో ఉన్నప్పుడు మన తప్పులు కనపడవు. అపజయం ఎదురైతే మన లోపాలు కళ్ళ ముందు కనిపిస్తాయి.
హార్దిక్ మారుస్తాడా
ఇంగ్లీష్ జట్టుతో ఓటమి తర్వాత భారత టీమ్ లో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టి20 లకు సీనియర్లకు క్రమంగా విశ్రాంతి ఇచ్చి కొత్త రక్తాన్ని ఎక్కించాలనే ఆలోచనలో భారత క్రికెట్ సమాఖ్య ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే విధానాన్ని t20 క్రికెట్ టోర్నీ ముందే ప్రవేశపెడితే భారత జట్టు పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా తరచూ చెప్పిన మార్పు చేపడుతున్న బీసీసీఐ.. టి20 కైనా హార్దిక్ పాండ్యాను దీర్ఘకాలం కెప్టెన్ గా కొనసాగిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hardik as team india t20 captain
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com