Ind Vs Pak: ఫిక్సర్ కు సిక్సర్.. పాక్ మాజీ క్రికెటర్ కు హర్భజన్ పంచ్ అదుర్స్

Ind Vs Pak: ప్రపంచకప్ టీ20లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోగానే అన్ని వైపుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరేసరికి పాకిస్తాన్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు ‘బర్రె ఈనినంత’ పండుగలా మారింది. వాళ్లు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్అమీర్ ట్విట్టర్ లో రెచ్చిపోయాడు. పాకిస్తాన్ గెలవగానే భారత్ ను ఎద్దేవా చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఓ పాత వీడియోను […]

Written By: NARESH, Updated On : October 28, 2021 2:36 pm
Follow us on

Ind Vs Pak: ప్రపంచకప్ టీ20లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోగానే అన్ని వైపుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరేసరికి పాకిస్తాన్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు ‘బర్రె ఈనినంత’ పండుగలా మారింది. వాళ్లు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్అమీర్ ట్విట్టర్ లో రెచ్చిపోయాడు. పాకిస్తాన్ గెలవగానే భారత్ ను ఎద్దేవా చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఓ పాత వీడియోను షేర్ చేశాడు.

harbhajan singh mohammad amir

పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ షేర్ చేసిన పాత వీడియోలో ‘హర్భజన్ బౌలింగ్లో షాహిద్ అఫ్రిది వరుసగా సిక్సర్లు బాదినట్లు ఉంది. దీనికి హర్భజన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. వెంటనే 2010లో ఇంగ్లండ్ సిరీస్ లో ఫిక్సింగ్ కు పాల్పడ్డ మహ్మద్ అమీర్ వీడియో, ఫొటోలను షేర్ చేశాడు. అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశారు..

‘ప్రజలు నిన్ను చూసేది కేవలం డబ్బుకోసం పాకులాడేవాడివని.. డబ్బు కోసం దేశాన్ని మోసం చేసేవాడివని.. గౌరవం, అభిమానం ఏమీ లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. మీ దేశ ప్రజలు మద్దతుదారులకు ఎంత లభించిందో మీరు చెప్పరు.. క్రికెట్ ను ఈ విధంగా అవమానించి ప్రజలను ఫూల్స్ చేసిన నీలాంటి వారితో మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది’ అని హర్భజన్ ట్వీట్ చేశారు.

ఇక అనంతరం మహ్మద్ అమిర్ బౌలింగ్ లో భజ్జీ సిక్సర్ బాది టీమిండియాను గెలిపించిన వీడియోను పోస్ట్ చేసి ‘ఫిక్సర్ కు సిక్సర్.. ఇక పద పోదాం’’ అన్నట్టుగా క్యాప్షన్ ఇచ్చాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లోనే అప్పటి పాకిస్తాన్ ఆటగాళ్లైన మహ్మద్ అమీర్ తోపాటు మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువైంది. అమిర్ కౌంటర్ కు అతడి ఫిక్సింగ్ ను బయటకు తీసి హర్భజన్ చేసిన ఎన్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: ఎంఎస్ ధోనిని క్రికెట్ మేధావి అని ఇందుకే అంటారు?