https://oktelugu.com/

Romantic Movie: రొమాంటిక్ మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వనున్న… హీరో రామ్

Romantic Movie: కొడుకు సినిమాని హిట్ చేయడానికి పూరి గట్టిగానే  ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి… ఆంధ్రా పోరి సినిమాతో హీరోగా మారి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆ తర్వాత పురి డైరెక్షన్ లో రిలీజ్ అయిన ” మెహబూబా ” కూడా ఆకాష్ కు హిట్ అందించ లేకపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేస్తున్న చిత్రం “రొమాంటిక్ “. దీంతో ఈ సినిమాను ఎలా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 01:33 PM IST
    Follow us on

    Romantic Movie: కొడుకు సినిమాని హిట్ చేయడానికి పూరి గట్టిగానే  ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి… ఆంధ్రా పోరి సినిమాతో హీరోగా మారి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆ తర్వాత పురి డైరెక్షన్ లో రిలీజ్ అయిన ” మెహబూబా ” కూడా ఆకాష్ కు హిట్ అందించ లేకపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేస్తున్న చిత్రం “రొమాంటిక్ “. దీంతో ఈ సినిమాను ఎలా అయిన హిట్ చేయాలని పూరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

    ఇందుకు కారణం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలనే చెప్పాలి. ఈ సినిమాకి పూరి స్వయంగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం. అలానే  రమ్యకృష్ణ  ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతుండడం. ముందుగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హీరో ” విజయ్ దేవరకొండ ” రావడం. అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… హీరో ఆకాష్ పూరి, కేతికా శర్మలను ఇంటర్వ్యూ చేయడం. ప్రభాస్ ప్రమోషన్ లో పార్ట్ అవ్వడంతో… ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ ఒక్క వీడియోకి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీ కోసం మరో స్టార్ హీరో రంగంలోకి దిగినట్లు సమాచారం.

    హీరో రామ్ ” రొమాంటిక్ ” మూవీ లో  గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. రామ్ కెరీర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తో పూరి జగన్నాథ్ ఓ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఆ అనుబంధం తోనే ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ గా కనిపించడానికి రామ్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ‘పీనే కే బాద్’ అనే సాంగ్ లో… రామ్ మాస్ స్టెప్స్ వేయనున్నారని సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తా నిజమో కాదో తెలియయాలంటే శుక్రవారం వరకు ఆగక తప్పదు.

    Also Read: Nagarjuna: అలాంటి సీన్స్ లో నటించడానికి… ఒప్పుకొను అంటున్న నాగార్జున