Harbhajan Singh : టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్రికెట్ ఆడినప్పుడు మైదానంలో తీవ్రమైన ఆవేశంతో ఉండేవాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లతో మ్యాచ్ లు జరిగినప్పుడు తన బౌలింగ్ విశ్వరూపాన్ని చూపించేవాడు. అందుకే హర్భజన్ సింగ్ కు నేటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన హర్భజన్ సింగ్.. సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్ గా ఉంటాడు. టీమిండికి సంబంధించిన ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటాడు. ఇదే సమయంలో టీమిండియాను ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు లేదా అభిమానులు పొరపాటున ఒక్క మాట అన్నా కూడా హర్భజన్ అసలు ఊరుకోడు. అంతకుమించి అనే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను ఉద్దేశించి ఓ పాకిస్తాన్ అభిమాని చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై హర్భజన్ సింగ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. దీంతో అది కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విపరీతమైన చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఐసీసీ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ జట్టు కంటే భారత్ అందనంత ఎత్తులో ఉంది. మరోవైపు పాక్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు భారత్ సుముఖంగా లేదు. తమ జట్టు ఆడే మ్యాచ్ లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీ ని కోరింది. దానికి ఐసీసీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు, ఆ దేశ క్రికెట్ అభిమానులు, పాత్రికేయులు భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగకుతున్నారు. పనికిరాని పోస్టులు పెడుతూ తమ వెకిలితనాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
ఇటీవల పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు తమ దేశ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు భారత్ రావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు హర్భజన్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. అది అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దానిని మర్చిపోకముందే పాక్ అభిమాని తమ జట్టు కెప్టెన్ బాబర్ అజాం ను హైలెట్ చేశాడు. భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ను చులకన చేసే విధంగా పోస్ట్ పెట్టాడు. అయితే దానిపై హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. ఆగ్రహం వ్యక్తం చేశాడు.. పాకిస్తాన్ అభిమాని పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం… వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ ముగిసిన తర్వాత.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ తన తోటి ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఇంటర్వ్యూ కోసం బాబర్ ను ప్రజెంటర్ గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ బతిమిలాడాడని.. అయితే బాబర్ ఏమాత్రం పట్టించుకోలేదని పాకిస్తాన్ అభిమాని ఆ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఇర్ఫాన్ కనిపించలేదు. ఈ పోస్ట్ హర్భజన్ సింగ్ కు కోపాన్ని తెప్పించింది.
“ఈ వీడియోలో ఇర్ఫాన్ ఎక్కడ ఉన్నాడు? అసలు మీకు మాట్లాడేటప్పుడు గౌరవం ఇవ్వాలని తెలియదు. మీ కళ్ళకు నిజాన్ని చూడడం చేతకాదు. అసలు ఇది నిజమైన వీడియో కాదు. ఒకవేళ జరిగితే.. ఇంగ్లీషులో ఇర్ఫాన్ ప్రశ్నలు అడిగితే.. మీ కెప్టెన్ బదులు ఇవ్వగలడా.. అలాంటప్పుడు బాబర్ కు తీవ్రమైన ఇబ్బంది కదా.. ఓహో మీ కెప్టెన్ కు ఇంగ్లీష్ రాదు కదూ” అంటూ హర్భజన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.. హర్భజన్ ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చాలామందిని నెటిజన్లు సరైన రిప్లై ఇచ్చారంటూ హర్భజన్ సింగ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు..” వదిలేయ్ భజ్జీ.. సోషల్ మీడియాలో స్టార్లుగా ఎదగాలని భావించి చాలామంది అబద్దాలను ప్రచారం చేస్తుంటారు.. వారి లక్ష్యం కూడా ఇదే” అంటూ అతడు కామెంట్ చేశాడు.
Where is @IrfanPathan in this video ?? Bolne ki tameez to aap logo ko pehle hi nahi thi. Ab aankho se dikhna bi bandh ho gya kya ? Waise bi agar angreji mai swal pooch liya to pange pad jayenge. https://t.co/0IQpnDEBC4
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 1, 2024