Hanuma Vihari : విరిగిన మణికట్టు.. కెరీర్ క్లోజ్ అవుతుందన్న వెరవని హనుమ విహారి

Hanuma Vihari : భారత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ కు అంతా సిద్ధమైంది. 2020/21 సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ హీరోగా మన హనుమ విహారి నిలిచాడు. నాడు అశ్విన్ తో కలిసి ఆస్ట్రేలియాను తట్టుకొని నిలబడి మ్యాచ్ డ్రా చేశాడు. తాజాగా రంజీ ట్రోఫీలో విరిగిన చేతితో బ్యాటింగ్ చేయడం ద్వారా తన మానసిక , శారీరక బలాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్ తాజాగా ఆంధ్రాను ఓడించి టోర్నమెంట్‌లో […]

Written By: NARESH, Updated On : February 5, 2023 9:59 pm
Follow us on

Hanuma Vihari : భారత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ కు అంతా సిద్ధమైంది. 2020/21 సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ హీరోగా మన హనుమ విహారి నిలిచాడు. నాడు అశ్విన్ తో కలిసి ఆస్ట్రేలియాను తట్టుకొని నిలబడి మ్యాచ్ డ్రా చేశాడు. తాజాగా రంజీ ట్రోఫీలో విరిగిన చేతితో బ్యాటింగ్ చేయడం ద్వారా తన మానసిక , శారీరక బలాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్ తాజాగా ఆంధ్రాను ఓడించి టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు వెళ్లింది. అయితే విహారి వీరోచితంగా పోరాడినా కూడా తన జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన విహారి బాంబు పేల్చాడు. తన ఫిజియో హెచ్చరికలను వెల్లడించాడు. దేశవాళీ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో ఆంధ్రా తరఫున బ్యాటింగ్ చేయడానికి తన కెరీర్ మొత్తాన్ని ఫణంగా పెట్టానని చెప్పాడు. “నేను బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మళ్లీ చేతికి తగిలితే నా కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఫిజియో 10 సార్లు నాతో చెప్పాడు. నేను క్రికెట్ ఆడకపోతే ఇబ్బంది లేదని ఫిజియోతో చెప్పాను. ఈ మ్యాచ్ తర్వాత కానీ ఈ మ్యాచ్‌లో నేను ఆంధ్రా కోసం వదులుకుంటే అది ఎప్పటికీ నా హృదయంలో బాధగా ఉంటుంది” అని ఫిజియోతో విహారి అన్నాడట…

విహారి తన చేతికి ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా మధ్యప్రదేశ్ పై రెండుసార్లు బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఎడమ చేతి గ్రిప్‌తో బౌండరీలు కొట్టాడు. మరికొన్ని పరుగులు జోడించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘‘క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌, ఆంధ్రాకి అంత ముఖ్యమైన మ్యాచ్‌ కావడంతో బ్యాటింగ్‌ చేయలేకపోయాను. చివరి వికెట్‌కు 10-15 పరుగులు జోడించగలిగినా ప్రయోజనం ఉంటుందని భావించాను. అందుకే చేయి విరిగినా ఆ నిర్ణయం తీసుకున్నా.. టీమ్‌ కోసం చేయాల్సి వస్తే ధైర్యం వస్తుంది’’ అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు..

దేశానికి తనను ఎంపిక చేయకపోవడం చాలా నిరాశకు గురిచేస్తోందని పేర్కొన్న విహారి, నిలకడగా బ్యాటింగ్ చేయగలిగితే అవకాశం వస్తుందని నమ్ముతున్నానని చెప్పాడు. “సహజంగానే కొంత నిరాశ ఉంటుంది కానీ దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేయడమే నా పని. తిరిగి పునరాగమనం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను దేశవాళీ క్రికెట్‌లో ఒకటి లేదా రెండు సీజన్లలో పెద్ద పరుగులు చేస్తే.. నా జట్టు కోసం మ్యాచ్‌లు గెలిస్తే మళ్లీ భారత్‌ తరఫున నన్ను నేను నిరూపించుకునే అవకాశం వస్తుంది’ అని విహారి అన్నాడు.

మొత్తంగా మణికట్టు విరిగినా కూడా హనుమ విహారి ఎడమ చేతితో బ్యాటింగ్ చేసి అందరి మదిని దోచుకున్నాడు. తన కెరీర్ ప్రమాదంలో పడుతుందని తెలిసినా ఈ సాహసానికి ఒడిగట్టాడు.