https://oktelugu.com/

Chess Champion Gukesh : కష్టపడి 11 కోట్లు సంపాదిస్తే..4.67 కోట్ల పన్ను కట్టాలా.. చెస్ ఛాంపియన్ గుకేష్ గుక్కపెట్టి ఏడవడమే తక్కువ..

హోరాహోరీగా జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలో భారత క్రీడాకారుడు దొమ్మరాజు గుకేష్ విశ్వవిజేతగా నిలిచాడు. చైనా ఆటగాడు, ఇండిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా) ను ఓడించాడు. ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 16, 2024 / 08:21 PM IST

    Chess Champion Gukesh Prize moneyy

    Follow us on

    Chess Champion Gukesh : ఈ గెలుపు ద్వారా గుకేష్ కు అక్షరాల 11 కోట్ల రూపాయలు దక్కాయి. ఎంతో కష్టపడి గుకేష్ ఆస్థానానికి చేరుకోవడంతో సర్వత్రా ప్రశంసలు లభించాయి. గుకేష్ ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలవడంతో గుకేష్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఇతర క్రీడాకారులు గుకేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు . ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలవడం ద్వారా గుకేష్ కు 11 కోట్లు ప్రైజ్ మనీగా లభించగా.. ఇందులో 4.67 కోట్లు పన్ను రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ మినహాయించుకుంది. దీనికి సంబంధించి పలు నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గుకేష్ ప్రైజ్ మనీ ద్వారా 11 కోట్లు గెలుచుకున్నాడు.. ఆ ప్రకారం అతడు తను సంపాదించిన ప్రైజ్ మనీలో 30% టాక్స్ స్లాబ్ పరిధిలోకి వస్తాడు. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం సుమారు మూడు కోట్ల 28 లక్షలు.. దానికి సర్ చార్జ్ కింద రూ. కోటి 30 లక్షలు.. ఈ మొత్తానికి సెస్ కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 4.67 కోట్లు ఆర్థిక శాఖ పన్ను రూపంలో మినహాయించుకోనుంది. ఈ ప్రకారం 4.67 కోట్లు పన్ను రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ వసూలు చేయనుంది. ఈ ప్రకారం చూసుకుంటే 40 శాతం పైనే గుకేష్ కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది.

    విపరీతమైన చర్చ

    గుకేష్ గెలుచుకున్న ప్రైజ్ మనీలో 40% కేంద్ర ఆర్థిక శాఖకు వెళ్తున్న నేపథ్యంలో నెట్టింట తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ” ఆ మేధస్సును ఖర్చు చేసి గుకేష్ విజేతగా నిలిచాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. అతడి లో ఉన్న సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. చివరికి తమ కెరియర్ కూడా వదులుకున్నారు. అటువంటి ఆటగాడు ఎన్నో కష్టాలు పడి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 11 కోట్లు ప్రైజ్ మనీ గా గెలుచుకున్నాడు. కానీ గెలిచింది అతడు కాదు.. ముమ్మాటికి కేంద్ర ఆర్థిక శాఖ.. అతడి కష్టపడి 11 కోట్లు సంపాదిస్తే.. కేంద్ర ఆర్థిక శాఖ అందులో 40% లాగేసుకుంది. ఇప్పుడు చెప్పండి ఇందులో గెలిచింది ఎవరు? గుకేష్ అని చెబితే అది ముమ్మాటికి అబద్ధమే.. కచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ గెలిచింది. నిర్మల సీతారామన్ గారు గెలిచారు. ఈ విషయంలో ఆమె విశ్వవిజేతగా నిలిచారు.. ఆమె ఈ విషయంలో పట్టించుకుంటారా? అతడిది కూడా చెన్నై ప్రాంతమే? కొంతలో కొంత ఉదారత చూపిస్తారా? ఏమో కాలమే దీనికి సమాధానం చెప్పాలని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.