Donkey Meat: చిన్న పిల్లలకు దగ్గు, దమ్ము రోగం ఉంటే గాడిదపాలు తాగించాలంటారు. గాడిద పాలకు గిరాకీ బాగానే ఉంటుంది. ఒక్కో లీటర్ కు రూ. 4 నుంచి 6 వేల ధర పలుకుతుందంటే అవి ఎంత శ్రేష్టమో అర్థమవుతుంది. ఇలా గాడిద పాలను తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొంతమంది గాడిదలను పెంచుతూ వాటి పాలను విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో కొందరు గాడిదలను వధించి వాటి మాంసాన్ని అమ్ముతున్నారు. గాడిదలను చంపడం చట్టరీత్యా నేరం. దీనిపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై దాడికి సైతం ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. కొద్ది రోజులైతే గాడిదలను కూడా మనం జూలో చూడాల్సి వస్తుందని చెబుతున్నారు.
గాడిదల మాంసం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. దందా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో గుండె జబ్బులు పెరిగే అవకాశాలున్నాయి. గాడిద మాంసం తింటే కండరాలు బలపడతాయి. ఉబ్బసం తగ్గుతుందనేది అపోహ మాత్రమే. గాడిద రక్తం తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇలా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.
గాడిదలను వధిస్తూ విచ్చలవిడిగా వాటి మాంసం అమ్ముతున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాంసం కొవ్వు పెంచుతుంది కానీ ఆరోగ్యం ప్రసాదించదని తెలిసినా ఎందుకో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రెచ్చిపోతున్నారు. జంతు ప్రేమికుల వినతితో అధికారులు రంగంలోకి దిగి గాడిదల వధను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.