Gujarat Titans : సొంత మైదానంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి.. గుజరాత్ జట్టు సంచలన ఆట తీరు ప్రదర్శిస్తోంది. గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.. కమిన్స్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ ధారాళంగా పరుగులు ఇచ్చారు.. సొంత మైదానంపై గుజరాత్ ఆటగాళ్లు హైదరాబాద్ బౌలర్ల బౌలింగ్ ను ఊచ కోత కోశారు.. మహమ్మద్ షమీ రెండు ఓవర్లు వేసి 31 పరుగులు, కమిన్స్ రెండు ఓవర్లు వేసి 21 పరుగులు.. హర్షల్ పటేల్ ఒక ఓవర్ వేసి 18 పరుగులు.. ఇచ్చారు. ఇక మహమ్మద్ షమీ వేసిన ఓ ఓవర్ లో సాయి సుదర్శన్ 5 బౌండరీలు సాధించడం విశేషం.. ఇక ఈ సీజన్లో గుజరాత్ జట్టు తరఫున అదరగొడుతున్న గిల్, సాయి సుదర్శన్.. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లోనూ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. గిల్(41*), సాయి సుదర్శన్ (48) రన్స్ చేశారు.. ఫస్ట్ వికెట్ కు బలమైన పునాది వేశారు. సాయి సుదర్శన్, గిల్ వీర విహారం వల్ల.. గుజరాత్ జట్టుకు ఎదురులేకుండా పోయింది. 6.5 ఓవర్లలోనే 87 రన్స్ స్కోర్ చేయడం విశేషం.
Also Read : శభాష్ హార్దిక్..కంటిపై ఏడు కుట్లు పడినప్పటికీ.. మైదానంలో వీరవిహారం..
పవర్ ప్లే లో హైయెస్ట్ టోటల్స్
హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. ఐపీఎల్ లో పవర్ ప్లే లో గుజరాత్ జట్టు తరుపున హైయెస్ట్ స్కోర్ చేసిన జోడిగా నిలిచారు. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో పవర్ ప్లే లో గిల్, సాయి సుదర్శన్ 82 పరుగులు చేశారు. 2023లో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఓపెనర్లు వీర విహారం చేశారు. ఒక్క వికెట్ కూడా లాస్ కాకుండా 78 రన్స్ స్కోర్ చేశారు. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ప్లేయర్లు అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శించారు. జస్ట్ ఒక్క వికెట్ మాత్రమే లాస్ అయి పవర్ ప్లే లో 67 రన్స్ స్కోర్ చేశారు. ఇక ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ప్లేయర్లు ఓ రేంజ్ లో బ్యాటింగ్ చేశారు. ఒక్క వికెట్ మాత్రమే లాస్ అయి పవర్ ప్లే లో 67 రన్స్ స్కోర్ చేశారు.. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే సొంత మైదానంపై గుజరాత్ ఆటగాళ్లు వీరవిహారం చేశారు. హైదరాబాద్ బౌలింగ్ ను ఊచ కోత కోశారు. తద్వారా సొంతమైదానంలో తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు.. అయితే హైదరాబాద్ బౌలర్ల బౌలింగ్ నాసిరకంగా ఉండడంతో గుజరాత్ ఆటగాళ్లు పరుగులు ఇష్టానుసారంగా పిండుకున్నారు.. ఏ ఒక్క బౌలర్ కూడా సమర్థవంతంగా బంతులు వేయలేకపోవడంతో గుజరాత్ ప్లేయర్లు పండగ చేసుకున్నారు. ఇక ఈ కథనం రాసే సమయానికి గిల్ సేన 9.1 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది..గిల్, బట్లర్ క్రీజ్ లో ఉన్నారు.