Viral Video : ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం ఎంతో విచిత్రమైనది. దీని గురించి కొత్త విషయాలు తెలిసినప్పుడల్లా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఇంకా ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి దాగి ఉన్న విషయాలను వెలికి తీసేందుకు చాలా మంది కలిసి గ్రూపులుగా ఏర్పడి వెతుకుతూనే ఉన్నారు. వాళ్లు వెతికి బయటపెట్టిన వింతలు, విశేషాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఇలాంటి పనులు చేసే చాలా పేజీలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన కొందరు స్నేహితులు కలిసి ఒక అకౌంట్ తెరిచి, అలాంటి వీడియోనే షేర్ చేశారు. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ అకౌంట్ పేరు undergroundbirmingham. ఈ గ్రూప్ ప్రత్యేకత ఏంటంటే వీళ్లు గుహల్లోనూ, బంకర్‌లలోనూ దాగి ఉన్న ప్రపంచాన్ని అన్వేషిస్తారు.
Also Read : పిచ్చికి పరాకాష్ఠ.. రీల్స్ కోసం చెట్టెక్కి డ్యాన్స్ చేసిన యువతి !
ఈ మధ్య వీళ్లు ఒక గుహను కనుగొన్నారు. ఆ టీమ్ లోపలికి వెళ్లి చూసిన దృశ్యం వాళ్లనే షాక్‌కి గురిచేసింది. అది ఒక వింత ప్రపంచంలా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ గుహ శతాబ్దాలుగా మూసి ఉంది. దాన్ని తెరిచి చూసినప్పుడు వాళ్ల కళ్ల ముందు ఊహించని దృశ్యం కనిపించింది. మొదట భయపడినా తర్వాత టీమ్ లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇలాంటి గుహలు కొన్నిసార్లు ప్రమాదకరమైన జంతువులకు నిలయంగా ఉంటాయని వాళ్లకు తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని గుహ తలుపు తెరిచారు.
గుహను మొదటిసారి చూసినప్పుడు ఎవరో ఒక కుటుంబం ఇక్కడ నివసించి ఉండవచ్చని టీమ్‌కు అనిపించింది. కానీ ఏదో కారణం వల్ల వాళ్లు ఈ స్థలం విడిచి వెళ్లిపోయి ఉంటారు. గుహలో ఒక ఫ్రిజ్‌లో నిత్యం ఉపయోగించే వస్తువులన్నీ ఉన్నాయి. నీటి పైప్‌లైన్ కూడా ఉంది. ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ, గుహ లోపల నుండి కిందికి వెళ్లడానికి మెట్లు కనిపించాయి. వాళ్లు దాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వెంటనే వైరల్ అయిపోయింది.
View this post on Instagram