GT Vs MI: ఐపీఎల్ (IPL) లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Ahmedabad Narendra Modi stadium) వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ (GT vs MI) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు లాస్ అయ్యి 196 రన్స్ స్కోర్ చేసింది. గుజరాత్ జట్టు బ్యాటర్లలో ఓపెనర్లు సాయి సుదర్శన్ (63), గిల్(38), బట్లర్ (39) పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక మిగతా ఆటగాళ్లు అత్యంత దారుణమైన ప్రదర్శన చేశారు. ఏ మాత్రం మైదానంలో ఉండాలనే ఆసక్తి వారిలో లేనట్టు కనిపించింది. దీంతో 200 మించి పరుగులు చేయాల్సిన గుజరాత్ జట్టు 196 పరుగుల వద్ద ఆగిపోయింది. గుజరాత్ జట్టులో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇతర బౌలర్లు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు..
పాపం రోహిత్ శర్మ
197 పరుగుల విజయ లక్ష్యం తో రంగంలోకి దిగిన ముంబై జట్టుకు ప్రారంభంలోనే గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. రికెల్టన్ (6) కు అద్భుతమైన బంతివేసి మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్ద్ చేశాడు. దీంతో ముంబై జట్టు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ రోహిత్ శర్మ రూపంలో 8 పరుగుల వద్ద కోల్పోయిన ముంబై జట్టు.. రెండో వికెట్ ను రికెల్టన్(6) రూపంలో 35 పరుగుల వద్ద నష్టపోయింది . అయితే ఈ రెండు వికెట్లను కూడా మహమ్మద్ సిరాజ్ తీయడం విశేషం. మహమ్మద్ సిరాజ్ గత సీజన్లో బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అయితే సరిగ్గా బౌలింగ్ చేస్తలేడు అనే కారణంతో అతడిని బెంగుళూరు జట్టు వదిలేసుకుంది. వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ లో సిరాజ్ అంతగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో తన ప్రభావాన్ని చూపించాడు. రోహిత్ శర్మ, రికెల్టన్ వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. రోహిత్ వికెట్ ను పడకొట్టిన నేపథ్యంలో.. మహమ్మద్ సిరాజ్ ను నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రోహిత్ శర్మ జైలు గదిలో ఉండ.. జైలు గదికి ముందు పోలీస్ వేషం లో మహమ్మద్ సిరాజ్ దర్శనం ఇచ్చాడు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మహమ్మద్ సిరాజ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్పీగా ఉద్యోగం ఇచ్చారు. ఆమధ్య సిరాజ్ ఛార్జ్ కూడా తీసుకున్నారు. సిరాజ్ పోలీస్ ఆఫీసర్ కావడం.. తక్కువ ఎత్తులో బంతిని విసిరి రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెర్చింగ్ పర్సనాలిటీ గా సిరాజ్ మారిపోయాడు.. అతడు రోహిత్ శర్మను జైల్లో వేసినట్టుగా నెటిజన్లు రూపొందించిన డిజిటల్ పోస్టర్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నది.