Homeజాతీయ వార్తలుAir Raid Sirens : పాక్ పై దాడి తర్వాత దేశవ్యాప్తంగా అలర్ట్.. ఎయిర్ రైడ్...

Air Raid Sirens : పాక్ పై దాడి తర్వాత దేశవ్యాప్తంగా అలర్ట్.. ఎయిర్ రైడ్ సైరన్ మోగితే ఏం చేయాలి?

Air Raid Sirens : పహల్గామ్‌లో మొన్న జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత దేశంలో టెన్షన్ పెరిగిపోయింది. పాకిస్తాన్ మీద 9చోట్ల భారత్ ఆర్మీదాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 100మంది హాతం అయినట్లు తెలుస్తోంది. భారత్ దాడికి పాకిస్తాన్ అలర్ట్ అవుతుందని అంటున్నారు. ఒక వేళ పాకిస్తాన్ దాడులు గనుక మొదలు పెడితే ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇవాళ (మే 7) చాలా రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ చేయమని చెప్పింది. గవర్నమెంట్ సోర్సులు ఈ విషయం వెల్లడించాయి.

Also Read : ఖాళీ అయిపోయిన పాక్ ఎయిర్ స్పేస్.. నిండిన ఇండియన్ ఎయిర్ స్పేస్

ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతాయి, సేఫ్టీ డ్రిల్స్ చేస్తారు
ఈ డ్రిల్స్‌లో భాగంగా, ఎమర్జెన్సీ వస్తే ఎలా ఉండాలో చూపించడానికి ఎయిర్ రైడ్ సైరన్లు మోగిస్తారు. స్కూల్ పిల్లలతో సహా అందరూ ఈ ట్రైనింగ్‌లో పాల్గొంటారు. ఎవరైనా దాడి చేస్తే ఎలా కాపాడుకోవాలో వీళ్లకు నేర్పిస్తారు.

లైట్లన్నీ ఆపేస్తారు, ముఖ్యమైన చోట్ల రంగులేస్తారు
ఈ డ్రిల్స్‌లో ఎమర్జెన్సీ బ్లాక్‌అవుట్ కూడా చేస్తారు. అంటే లైట్లన్నీ ఆపేస్తారు. అలాగే ముఖ్యమైన బిల్డింగులు, ఫ్యాక్టరీలకి రంగులేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఎటాక్ చేస్తే అవి వెంటనే కనపడకుండా ఉండటానికి ఈ ప్లాన్. అన్ని రాష్ట్రాలు వాళ్ల తరలింపు ప్లాన్లను మార్చుకోవాలని, అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలని కేంద్రం చెప్పింది. భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం వస్తే ప్రజల్ని ఎలా కాపాడాలనే దానిపై కొత్త ప్లాన్లు రెడీ చేస్తున్నారు. గత 11 రోజులుగా పాకిస్తాన్ సైనికులు కంట్రోల్ లైన్ దగ్గర కాల్పులు జరుపుతున్నారు. అందుకే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. మన ఆర్మీ కూడా వాళ్లకు గట్టిగా బదులిస్తోంది.

పహల్గామ్ దాడితో మళ్లీ టెన్షన్
పాకిస్తాన్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో దాడి చేసి ఒక టూరిస్ట్‌తో సహా 26 మందిని చంపేశారు. 2019లో పుల్వామాలో జరిగిన దాడి తర్వాత ఇదే పెద్ద టెర్రరిస్ట్ ఎటాక్. దీనికి రియాక్షన్‌గా పాకిస్తాన్ కూడా వాళ్ల ఆర్మీని రెడీగా ఉంచింది, బోర్డర్ దగ్గర ఎక్కువమందిని పెట్టింది. అంతేకాదు, క్షిపణి పరీక్షలు కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా ఎటాక్ చేయొచ్చని పాకిస్తాన్ అధికారులు అంటున్నారు, ఒకవేళ చేస్తే గట్టిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.

ఎయిర్ రైడ్ సైరన్ అంటే ఏంటి?
“ఆల్ క్లియర్” సైరన్ అంటే ఏదైనా ప్రమాదం – ఎయిర్ రైడ్, క్షిపణి దాడి లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యం – అయిపోయిందని అర్థం. అప్పుడు అందరూ షెల్టర్ల నుంచి బయటకు రావచ్చని, మామూలుగా ఉండొచ్చని ఈ సైరన్ చెప్తుంది.

“ఆల్ క్లియర్” సైరన్ ఎలా ఉంటుంది:
ఒకేలాంటి సౌండ్ వస్తుంది, పైకి కిందకి పోదు. దాదాపు ఒక నిమిషం పాటు మోగుతుంది. ప్రమాదం తగ్గిందని, బయటకు రావచ్చని దీని అర్థం.

బ్లాక్‌అవుట్ అంటే ఏంటి?
బ్లాక్‌అవుట్ అంటే అన్ని లైట్లు ఆపేయడం. ముఖ్యంగా యుద్ధం జరిగేటప్పుడు శత్రువులకు మన బిల్డింగులు కనపడకుండా ఉండటానికి ఇలా చేస్తారు.

ఎయిర్ సైరన్ వింటే ఏం చేయాలి?
ఎయిర్ రైడ్ సైరన్ వింటే, వెంటనే మీరు చేస్తున్న పని ఆపేయాలి. దగ్గరలో ఉన్న షెల్టర్‌కి లేదా సురక్షితమైన గదికి వెళ్లాలి. కిటికీలు, తలుపులు, కర్టెన్లు మూసేయాలి. లైట్లు ఆపేయాలి. టార్చ్‌లైట్ లేదా బ్యాటరీ లైట్లు వాడుకోవచ్చు. రేడియో లేదా టీవీలో ఏం చెప్తున్నారో వినాలి. ఎమర్జెన్సీ కిట్ దగ్గర ఉంచుకోవాలి. భయపడకుండా ఇతరులకు ధైర్యం చెప్పాలి.

ఎయిర్ రైడ్ సైరన్ ఎలా మోగుతుంది?
ఎయిర్ రైడ్ సైరన్ పెద్దగా, ఒకలా కాకుండా పైకి కిందకి పోతూ ఉంటుంది. ఏదైనా ప్రమాదం వస్తుందని అందరికీ అలర్ట్ చేయడానికి ఇలాంటి సౌండ్ పెడతారు. పహల్గామ్ దాడి గురించి ప్రధాని మోడీ చాలా పెద్ద మీటింగ్‌లు పెట్టారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. టెర్రరిస్టులను ఎక్కడ ఉన్నా సరే పట్టుకుంటామని, వాళ్లకు సహాయం చేసిన వాళ్లను కూడా వదిలిపెట్టమని మోడీ గట్టిగా చెప్పారు.

Also Read: మాక్ డ్రిల్: మే 7న భారతదేశంలో వైమానిక దాడి సైరన్లు మోగబోతున్నాయా? ఇది ఎలా పని చేస్తుందంటే?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version