GT vs MI Eliminator Match : గుజరాత్ – ముంబై జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందని అంచనాలు ఉన్నాయి. మ్యాచ్ నిర్వహించే మైదానం బౌలర్లకు సహకరిస్తుందనే విశ్లేషణలు సాగుతున్నాయి..పిచ్ పై బంతికి అనుకూలమైన స్వింగ్ లభిస్తుందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. బెంగళూరు – పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. ముందుగా బౌలింగ్ వేసిన జట్టుకు అడ్వాంటేజ్ లభించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ లో టాస్ అత్యంత కీలకం అవుతుందని వారు అంటున్నారు. మొత్తంగా చూస్తే ముల్లాన్ పూర్ లో మరోసారి బౌలర్ల షో కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే రెండు జట్లకు విజయం కచ్చితంగా కావాల్సి ఉండడంతో చివరి వరకు పోరు హోరాహోరీగా సాగుతుందని పేర్కొంటున్నారు.. ఈ అంచనాలు ఇలా సాగుతుండగానే.. ముంబై జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది.
Also Read : ‘గద్దర్ అవార్డ్స్’ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు చోటు లేదా..? ఇదెక్కడి న్యాయం!
ముంబై జట్టులో ఇప్పటికే రికెల్టన్, విల్ జాక్స్ లేరు. వారిద్దరు కూడా తమ జాతీయ జట్లకు ఆడేందుకు స్వాదేశాలకు వెళ్లిపోయారు. బెయిర్ స్టో తో కలిసి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ ప్రారంభిస్తాడు. బౌలింగ్ పరంగా ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బంది లేదు. సూర్య కుమార్ యాదవ్ తన కెరియర్ లోనే అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు మరోసారి అతడు పరుగుల పారించే అవకాశం లేకపోలేదు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు చేదు వార్త.. కీలకంగా ఉన్న తిలక్ వర్మ, పేస్ బౌలర్ దీపక్ చాహర్ ఆడేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే వీరిద్దరూ పంజాబ్ జట్టుతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్లో గాయపడ్డారు. ఇక విమానాశ్రయంలో ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు కాస్త అసౌకర్యంగా కనిపించారు. దీపక్ చాహర్ మోకాలికి కట్టుకట్టుకున్నాడు. తిలక్ వర్మ కుంటుకుంటూ కనిపించాడు. వారిద్దరూ ఈ స్థితిలో ఉండగా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది .
వీరిద్దరి శరీర సామర్థ్యం పై ముంబై జట్టు ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు వీరిద్దరూ గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఆడేది అనుమానంగానే ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ముంబై జట్టుకు కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే దీపక్ చాహర్ కీలక దశలో వికెట్లు తీస్తూ ముంబై జట్టుకు తిరుగులేని బ్రేక్ ఇస్తున్నాడు. ఈ లెక్కన అతడు గనుక ఆడకపోతే.. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు తిలక్ వర్మ కూడా ఆడకపోతే.. అతడి స్థానంలో ఎవరితో ఆడిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.