Homeటాప్ స్టోరీస్Revanth reddy : రేవంత్ ‘సంక్షేమం 2.0’.. అసలు పిక్చర్ ఇప్పుడే మొదలైందా?

Revanth reddy : రేవంత్ ‘సంక్షేమం 2.0’.. అసలు పిక్చర్ ఇప్పుడే మొదలైందా?

Revanth reddy : “సినిమా అసలు కథ ఇప్పుడే మొదలైంది…” అంటూ మాస్ హీరోలు ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత డైలాగ్ కొడితే థియేటర్లలో ఈలలు పడతాయి. సరిగ్గా ఇదే ఫార్ములాను ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ఫాలో అవుతోంది. తొలి రెండున్నరేళ్లు ఎన్నికల ట్రైలర్లు, ఉపఎన్నికల స్పెషల్ షోలు, రాజకీయ ట్విస్టుల స్క్రీన్‌ప్లేతో సరిపెట్టిన పాలకులు… “ఇక నుంచి అసలు సినిమా చూపిస్తాం” అంటూ సెకండాఫ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు.

మొన్నటివరకు “ఎన్నికలు… ఓట్లు…” అంటూ పొలిటికల్ థ్రిల్లర్ చూపించిన నేతలు, ఇప్పుడు హఠాత్తుగా “పరిపాలన… డెవలప్‌మెంట్…” అంటూ క్లాస్ డైలాగులు అందుకున్నారు. అంటే ఇప్పటివరకు జరిగింది కేవలం వార్మప్ మాత్రమేనట, అసలు మ్యాచ్ ఇప్పుడే మొదలైందన్నమాట!

అధికారుల బదిలీలు… కొత్త కాస్టింగ్ డైరెక్టర్స్!

సినిమాలో సెకండాఫ్ అనగానే పాత క్యారెక్టర్లు మాయమై, కొత్త ముఖాలు ఎంట్రీ ఇవ్వడం కామన్ కదా. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలతో కొత్త ‘కాస్టింగ్’ సెట్ చేశారు. పర్ఫార్మెన్స్ అదిరిపోతే క్లైమాక్స్ వరకు స్క్రీన్‌పై ఉంటారు… లేదంటే “మీ క్యారెక్టర్ ఇక్కడితో ముగిసింది సార్” అంటూ ప్యాకప్ చెప్పేసి లూప్ లైన్ లో పడేస్తున్నారు.

119 నుంచి 182… సీట్లు పెరిగితే సీరియల్ హ్యాపీయేనా?

నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 182కి పెంచుతారనే కొత్త లీకులు మార్కెట్లోకి వదిలారు. దీంతో ఇప్పటివరకు టికెట్ దొరకక, పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగిన లీడర్ల ముఖాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. “ఇంకొంచెం ఆగండి బాస్… కొత్త సీట్లు వస్తున్నాయి, మీకోసం ఓ సీటు రిజర్వ్ చేద్దాం” అనే డైలాగ్‌తో అసంతృప్త నేతలను మరో రెండేళ్లపాటు వెయిటింగ్ లిస్టులో కూర్చోబెట్టడానికి ఈ కొత్త స్క్రిప్ట్ బాగానే పనికొచ్చేలా ఉంది.

ప్రాజెక్టుల ఫస్ట్ లుక్… టీజర్ ఓకే, రిలీజ్ ఎప్పుడు?

మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, వరంగల్ ఎయిర్‌పోర్ట్, మూసీ రివర్‌ఫ్రంట్… ఇలా వరుసపెట్టి భారీ ప్రాజెక్టుల ‘ఫస్ట్ లుక్’ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్, ఎలివేషన్లు చూసి జనాలు మురిసిపోతున్నారు కానీ థియేటర్ లో కూర్చున్న సామాన్య ప్రేక్షకుడు మాత్రం ఒకటే అడుగుతున్నాడు… “అయ్యా! టీజర్లు, పోస్టర్లు అదరగొట్టారు సరే… ఇంతకీ ప్రాజెక్టుల కంప్లీషన్ డేట్ ఎప్పుడో కాస్త చెబుతారా?” అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.

సీఎంవోలో రీ-రైటింగ్… సంక్షేమం 2.0

ఇటు సీఎంవోలో చూస్తే కొత్త సీఎస్, కొత్త సలహాదారులతో స్క్రిప్ట్ డాక్టరింగ్ జరుగుతోంది. “రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్” లాంటి భారీ ఇంగ్లీష్ పదాలు వినిపిస్తుంటే… కింది స్థాయి అధికారులు మాత్రం “అసలు ఫైల్ ఎక్కడుంది బాస్?” అంటూ పాత ప్రశ్నకే సమాధానాలు వెతుక్కుంటున్నారు.

మరోవైపు సంక్షేమం 2.0 వెర్షన్ కూడా రెడీ అవుతోంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లతో పాటు తులం బంగారం స్కీమ్… ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ లిస్టుకు మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యేలా ఉన్నాయి. ఈ ట్విస్టులు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం చిరునవ్వులు చిందిస్తున్నారు.

క్లైమాక్స్ ఇంకా దూరమే..!

ప్రస్తుతానికి ప్రభుత్వం చెబుతున్న పాయింట్ ఒక్కటే “ఇంటర్వెల్ ముగిసింది.. అసలు పిక్చర్ ఇప్పుడే స్టార్ట్ అయింది.” అయితే, సీట్లలో కూర్చున్న పబ్లిక్ మాత్రం జేబులో ఖాళీ అయిన పాప్‌కార్న్ టబ్‌ను చూసుకుంటూ… “బాస్.. ఈసారైనా నిజంగానే సినిమా చూపిస్తారా? లేక మళ్లీ నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ట్రైలర్లతోనే సరిపెడతారా?” అని గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి.. ఈ సెకండాఫ్ హిట్ అవుతుందో.. లేక యావరేజ్‌గా మిగిలిపోతుందో..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version