Indian Football : భారత ఫుట్ బాల్ జట్టు గత కొన్నాళ్లుగా నిలకడగా ప్రదర్శన చేస్తోంది. అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతోంది. ఈ ఆట తీరే సుమారు ఐదేళ్ల విరామం తరువాత భారత పురుషుల పుట్ బాల్ జట్టు.. ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్ లో టాప్ 100 లో చోటు దక్కించుకునేలా చేసింది. కొన్నాళ్ల కిందట ప్రకటించిన ర్యాంకులో 100వ స్థానంలో నిలిచిన భారత్ జట్టు.. ఈసారి ఒక స్థానం మెరుగుపరుచుకొని 100 వ స్థానంలోకి చేరింది.