https://oktelugu.com/

Glenn Maxwell: ఐపిఎల్ మీద షాకింగ్ కామెంట్లు చేసిన మాక్స్ వెల్…

ఐపిఎల్ అనేది నాకే కాదు ప్రతి ఒక్క క్రికెటర్ కి కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ కెరియర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ కూడా వాళ్ళ కెరియర్ లో ఒక్కసారైనా ఐపీఎల్ ఆడితే వాళ్ళ ఆట తీరు మెరుగుపడుతుంది అంటూ చెప్పాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 6, 2023 / 03:42 PM IST

    Glenn Maxwell

    Follow us on

    Glenn Maxwell: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన,విలువైన లీగ్ గా ఐపీఎల్ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ప్రపంచంలో క్రికెట్ అడే ప్రతి ప్లేయర్ కూడా కనీసం ఒక్కసారైనా ఐపిఎల్ లో పార్టిసిపేట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇక ఇదే క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడుతూ తమ సత్తాను చాటుతూ ఇంటర్నేషనల్ మ్యాచు లు ఆడటానికి తమ దేశం తరుపున సెలెక్ట్ అవుతున్నారు. ఇక ఇదే క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ అయిన గ్లెన్ మ్యాక్స్ వెల్ స్పందిస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఐపీఎల్ ఆడతాను అంటూ ఓపెన్ గా ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది…

    తన కెరీర్ అనేది ఐపీఎల్ వల్లనే చాలా స్ట్రాంగ్ గా తయారైందని ఐపిఎల్ లో ఆడే రెండు నెలలు ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన ప్లేయర్లు అందరితో కలిసి ఆడుతాం దానివల్ల వాళ్ళ ఆట తీరు, మెలుకులనేది మనం నేర్చుకోవడానికి అలాగే ప్రపంచంలోని అత్యుత్తమమైన కోచ్ లుగా గుర్తింపు పొందిన కోచ్ లతో గడపడం అనేది ప్లేయర్ల క్రికెట్ కెరీయర్ కి చాలా ఉపయోగపడుతుందంటూ వ్యాఖ్యానించాడు. అలాగే తను బెంగళూరు టీం కి ఆతిథ్యం ఇస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక బెంగళూరు గురించి మాట్లాడుతూ బెంగళూరు టీం లో విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ లాంటి దిగ్గజ ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల వాళ్ల ఆట తీరులోని మేలుకోలు నేర్చుకోవడం తో పాటు మనం కూడా ఎలా ఆడాలి ఎలా టీమ్ ని గెలిపించాలి అనే మెలకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.

    ఐపిఎల్ అనేది నాకే కాదు ప్రతి ఒక్క క్రికెటర్ కి కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ కెరియర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ కూడా వాళ్ళ కెరియర్ లో ఒక్కసారైనా ఐపీఎల్ ఆడితే వాళ్ళ ఆట తీరు మెరుగుపడుతుంది అంటూ చెప్పాడు. ఇక 2024 లో వచ్చే టి20 వరల్డ్ కప్ కోసం ఐపీఎల్ లో సత్తా చాటి అదే ఫామ్ ని వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ చేస్తానంటూ మాక్స్ వెల్ చెప్పాడు…

    నిజానికి మాక్స్ వెల్ రీసెంట్ గా ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ గెలవడం లో కీలక పాత్ర వహించాడు…ఇక ఇది ఇలా ఉంటే రేపటి నుంచి బిగ్ బాష్ లీగ్ స్టార్ట్ అవుతుంది. మెల్ బోర్న్ స్టార్స్ జట్టు తరఫున మాక్స్ వెల్ ఆడుతున్నాడు.ఇక్కడ కూడా తన సత్తా చాటడానికి మాక్స్ వెల్ ట్రై చేస్తున్నాడు…