CM Chandrababu: జూన్ 5వ తేదీన కోటీ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రుల, కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు. రోడ్లు, బస్టాండు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ట్రీ గార్డులతో మొక్కలు నాటాలని సూచించారు. 2033 నాటికి రాష్ట్రంలో పచ్చదనం 37 శాతానికి, 2047 నాటికి 50 శాత పెరగాలని అని సీఎం చంద్రబాబు అన్నారు.