Ind vs Pak:ప్రపంచకప్ టీ20 లో ఈ దశాబ్ధపు అతిపెద్ద క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు దాయాది దేశాలైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కొదమ సింహాల్లా తలపడనున్నాయి. ఆదివారం సెలవు కావడం.. రాత్రి మ్యాచ్ ఉండడంతో అందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
shoiab akthar
రెండు శత్రుదేశాలైన వీటి మధ్య మ్యాచ్ యుద్ధాన్ని తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ యుద్ధం ఇప్పుడు పతాకస్థాయికి చేరింది.యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ హాట్ ఫేవరేట్. అన్ని మ్యాచ్ లలోనూ పాకిస్తాన్ పై విజయం సాధించింది. తిరుగులేని రికార్డు భారత్ సొంతం. ఈ క్రమంలోనే మాజీలు, ఇతర విశ్లేషకులు అంతా ఎవరు గెలుస్తారన్నది విశ్లేషణలు చేస్తున్నారు.
ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా అయితే భారత్ పై గెలిస్తే క్రికెటర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తామని ప్రకటించారు. ఇక పాకిస్తాన్ క్రికెటర్లు అంతా కూడా ఆ టీంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ తాజాగా పాకిస్తాన్ జట్టుకు ఒక వింత సలహాను ఇచ్చాడు. ఇండియాపై ప్రపంచకప్ లో గెలవాలంటే మ్యాచ్ కు ముందు ఆ జట్టు ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలని సూచించాడు. మెంటర్ ధోనిని బ్యాట్ పట్టుకోకుండా చూసుకోవాలని పాక్ జట్టుకు సూచించాడు. రెండు రోజుల పాటు విరాట్ కోహ్లీని ఇన్ స్టాగ్రామ్ ఉపయోగించకుండా అడ్డుపడాలని సరదాగా కామెంట్ చేశారు.
పాకిస్తాన్ ఓపెనర్లు మంచి ఆరంభాలను ఇవ్వాలని.. 6 ఓవర్ల వరకూ బాల్ టు బాల్ రన్ రేట్ కాపాడుకోవాలని అక్తర్ సూచించాడు. మంచి లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచితే బౌలింగ్ లో విరుచుకుపడి గెలువచ్చని సలహా ఇచ్చాడు.