https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఇన్ని కష్టాలా.. బోరు మని ఏడ్చిన యావర్.. హౌస్ ను కన్నీళ్లతో నింపేశాడు

పదవ వారం అంటే ఫ్యామిలీ వీక్ ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యుల ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే శివాజీ కొడుకు, అమర్ దీప్ భార్య, గౌతమ్ కృష్ణ తల్లి, ప్రశాంత్ తండ్రి లాంటి వారు ఇంట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : November 10, 2023 / 04:55 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. టాస్క్ లు, ఎలిమినేషన్, లవ్, ఫ్రెండ్ షిప్, గ్యాంగ్ లు అంటూ సాగిపోతుంది బిగ్ బాస్. ఇక వారాలు గడుస్తున్న కొద్ది కొందరు వెల్లడం కామన్. మరికొందరు ఎంట్రీ ఇవ్వడం కామన్. ఈ సారి ఇంట్లో నుంచి వెళ్లిన రతికా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా నడుస్తోంది ఈ బిగ్ బాస్ హౌజ్ లో.. కుటుంబ సభ్యులు రావడం వారిని చూసి ఎమోషనల్ గా ఏడ్వడం జరుగుతుంది.

పదవ వారం అంటే ఫ్యామిలీ వీక్ ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యుల ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే శివాజీ కొడుకు, అమర్ దీప్ భార్య, గౌతమ్ కృష్ణ తల్లి, ప్రశాంత్ తండ్రి లాంటి వారు ఇంట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం మొత్తం ఎమోషనల్ డ్రామా నడుస్తోందనే చెప్పాలి. పేరెంట్స్ ను, కుటుంబ సభ్యులను చూసిన కంటెస్టెంట్స్ బోరుమని ఏడుస్తున్నారు. వచ్చిన వారు ధైర్యం చెప్పి వెళ్తున్నారు. ఇలా మంచి ఎమోషన్ ను పండిస్తున్నాడు బిగ్ బాస్.

రెండు నెలలకు పైగా ఇంటికి దూరమై ఆడుతున్న వీరిలో జోష్ నింపేందుకు ఫ్యామిలీ వీక్ ను ఏర్పాటు చేసి.. ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా శోభా శెట్టి తల్లి, అమర్ దీప్ భార్య వచ్చిన విషయం తెలిసిందే. అలాగే యావర్ అన్నయ్య కూడా వచ్చాడు. మెయిన్ డోర్ ను ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఇంట్లో వారిని టెన్షన్ పెట్టాడు. యావూ.. మేర బచ్చా అని మైక్ లో వినిపించగా యావర్ మొహంలో వెయ్యి దీపాలు వెలిగినంత పని అయింది. దీంతో వెంటనే డోర్ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లాడు.

కానీ అక్కడ యావర్ అన్నయ్య లేడు. ఇంట్లో నుంచే ఈయన సర్ ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు. ఇక ఇంట్లో వారిని కూడా పలకరించి గౌతమ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. రీసెంట్ గా గౌతమ్ తల్లి యావర్ ను దగ్గరకు తీసుకొని నేను నీకు కూడా అమ్మనే అనడంతో ఎమోషనల్ అయ్యాడు. అందుకే గౌతమ్ కు యావర్ అన్నయ్య థాంక్స్ చెప్పాడు. వీడికి అమ్మ ప్రేమ తెలియదని.. అమ్మను తలుచుకొని ఏడ్చారు ఇద్దరు. ఇలా ఇద్దరు ఏడ్వడంతో అది చూసిన శివాజీ వారిని ఓదార్చాడు. దీంతో యావర్ కు అమ్మ మీద ఉన్న ప్రేమ, ఆయన ఎంతలా అమ్మను మిస్ అవుతున్నాడో తెలిసి ప్రేక్షకులు కూడా కంటనీరు పెట్టారు. అనంతరం తమ్ముడికి అన్నయ్య మోటివేట్ చేసి కప్పును గెల్చుకొని రావాలి అంటూ ఇంటిని వీడాడు యావర్ అన్నయ్య.