Gautham Gambhir : ఐపీఎల్ గెలవాలంటే ఆటగాళ్లలో టాలెంట్ ఉండాలి. సాధించాలనే తెగువ ఉండాలి. గెలుపొందాలనే కసి ఉండాలి. ఆటగాళ్లలో అలాంటి లక్షణాలు ఉంటేనే ఐపీఎల్ కప్ ఒడిసి పట్టగలరు. అలాంటి ఆట తీరు ప్రదర్శించే ఇప్పటివరకు చెరో ఐదుసార్లు చెన్నై, ముంబై జట్ల ఆటగాళ్లు ఐపిఎల్ కప్ ను దక్కించుకున్నారు. కానీ, ఐపీఎల్ లో విజేత కావాలంటే ఇవేవీ అవసరం లేదట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్..కోల్ కతా నైట్ రైడర్స్ డగౌట్ పాడ్ కాస్ట్ లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఐపీఎల్ లో విజేత కావాలంటే ఏం చేయాలో.. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో.. గౌతమ్ గంభీర్ మాటల్లోనే.. తెలుసుకుందాం..
షారుక్ ఖాన్ ధైర్యం ఇచ్చారు
“2014లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్నాను.. ఆ సీజన్లో సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాను. నేను కఠినమైన పరిస్థితి అనుభవిస్తున్నాను. ఆ సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ నుంచి నాకు బలమైన ప్రోత్సాహం లభించింది. ఆ సీజన్లో టైటిల్ గెలిచేందుకు అది ప్రేరణగా నిలిచింది.. “మీరు ఎలా ఆడినా పర్వాలేదు. మిమ్మల్ని నేను వదులుకోలేనని” నాడు నాతో షారుక్ ఖాన్ అన్నారు. ఆ మాటలు నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అవి ఆ సీజన్లో టైటిల్ గెలిచేందుకు ఉపకరించాయి. నాడు షారుక్ ఖాన్ కేవలం ఏడు నిమిషాలు మాత్రమే నాతో మాట్లాడారు. ఒక యజమానిగా ఆయన క్రికెట్ గురించి మాట్లాడలేదు. నాలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసే మాటలు మాత్రమే మాట్లాడారు. అవి నాపై బలంగా పనిచేసాయి. దాని అంతిమ ఫలితం ఏమిటో మీరే చూశారంటూ” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
అది ప్రతిభావంతమైన జట్టు పని కాదు
పెద్ద పెద్ద టోర్నమెంట్లు గెలుపొందడం ప్రతిభావంతమైన జట్టు పని కాదని వ్యాఖ్యానించిన గౌతమ్ గంభీర్.. చివరి రక్తపు బొట్టు వరకు ఆటగాళ్లు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. అలాంటి ఆటగాళ్లు ఉన్న జట్టు మాత్రమే ఐపీఎల్ లో కప్ దక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. “మేము ఈ సీజన్లో ధైర్యంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తున్నాం. ఆటగాళ్లు మొత్తం ఆ ధైర్యం తోనే కలిసికట్టుగా సాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.. ఆటగాళ్లు తమలో నిగూడంగా ఉన్న అభిమాని కోసం పోరాడాలి. అలా చేస్తేనే జట్టు పటిష్టమైన స్థితిలో ఉంటుంది.. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల ప్రతిభ గురించి చర్చించడం నాకు ఒక రకంగా ఇబ్బంది అనిపిస్తుంది..నేను కోల్ కతా జట్టు కు ఆడుతున్నప్పుడు 2014 సీజన్ లో నాలుగు మ్యాచ్ లలో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాను. అప్పుడు షారుక్ ఖాన్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అందుకే నేను చాలాసార్లు అతడే నాకు అత్యుత్తమమైన యజమాని అని చెప్పాను.. నేను జట్టుకు నాయకుడుగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకున్నానని చెప్పను. కానీ నాపై షారుక్ ఖాన్ కు విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే కోల్ కతా ను విజేతను చేసిందని” గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
గౌతమ్ గంభీర్ ఇటీవల కాలం వరకు భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొనసాగాడు. అనంతరం తన పదవికి రాజీనామా చేసి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్ గా నియమితుడయ్యాడు.. ప్రస్తుతం అతని ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. బలమైన ఆటగాళ్ల సమూహంగా ఆ జట్టు పేరు తెచ్చుకుంది. గత రెండు సీజన్లో గౌతమ్ గంభీర్ లక్నో జట్టుకు మార్గదర్శి గా వ్యవహరించాడు.
Some banter, unheard stories, and lots of laughter with @GautamGambhir, @im_manishpandey, and @Broacha_Cyrus!
Watch Episode 1 of our podcast #KnightsDugout, OUT NOWhttps://t.co/05Vs9tda03
— KolkataKnightRiders (@KKRiders) April 20, 2024