Virat Kohli Century: కొంతమంది క్రికెటర్లకు ఫామ్ అనేది ప్రత్యేకంగా అవసరం లేదు. వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేస్తారు. కొన్ని సందర్భాలలో తమలయను కోల్పోతారు. ఆ తర్వాత తమదైన రోజు శివతాండవం చేస్తుంటారు. బ్యాట్ చేత పట్టుకుని బంతిని మైదానం నలు దిక్కులకు పంపిస్తారు. అయితే ఇటువంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. అందులో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. విరాట్ కోహ్లీ విఫలమైనప్పుడు చాలామంది విమర్శిస్తుంటారు. అలాంటి వారందరికీ తన ఆటతోనే సమాధానం చెబుతాడు విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ కొద్దిరోజుల పాటు తన లయను కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఈ సమయంలో అతడి మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో అతను రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విరాట్ ఆ విమర్శలను మౌనంగా భరించాడు. కొన్ని సందర్భాలలో ఒత్తిడి కూడా ఎదుర్కొన్నాడు. ఇవన్నీ కూడా విరాట్ కోహ్లీలో విపరీతమైన కసిని పెంచాయి. అందువల్లే అతడు తనలో ఉన్న పాత విరాట్ కోహ్లీ బయటకు తీసి ప్రత్యర్థి బౌలర్ల మీద పరాక్రమాన్ని ప్రదర్శించాడు. తాజాగా ఆదివారం జరిగిన వన్డే లో కూడా దక్షిణాఫ్రికా జట్టుపై సూపర్ సెంచరీ సాధించాడు. సెంచరీ సాధించిన అనంతరం ఒక్కసారిగా ఎగిరి గంతులు వేశాడు. విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తనలో ఉన్న ఒత్తిడిని మొత్తం జయించడానికి తీవ్రంగా కష్టపడ్డాడు.
సెంచరీ మార్క్ అందుకున్న తర్వాత ఒక్కసారిగా కేరింతలు కొట్టాడు. 37 సంవత్సరాల వయసులో కూడా విరాట్ కోహ్లీ తనలో వాడి తగ్గలేదని నిరూపించాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత, సోషల్ మీడియా మొత్తం అతడి నామస్మరణతో ఊగిపోయింది. సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఏ మాత్రం తగ్గలేదు. మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చివరికి అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాట్ ఊపుతూ అభిమానులకు అభివాదం చేస్తూ, డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడు. ఈ దశలో అతనికి గౌతమ్ గంభీర్ ఎదురుగా వచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ భుజాలు తట్టి అభినందించాడు. గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ లో ఆడారు. ఫైనల్ మ్యాచ్లో కూడా వీరిద్దరు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ప్రచారం జరిగింది. చివరికి టెస్టు జట్టుకు సారధిగా ఉంటానని విరాట్ కోహ్లీ ప్రతిపాదన చేసినప్పటికీ, దానిని గౌతమ్ గంభీర్ తిరస్కరించాడని ప్రచారం జరిగింది.. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ.. విరాట్ చేసిన తర్వాత గౌతమ్ గంభీర్ మాత్రం మనస్ఫూర్తిగా అభినందించాడు.