YCP political damage: ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని చూస్తుంది. గతంలో లోపాలు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలని భావిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆ పార్టీ సిద్ధాంతాలతో పాటు వాయిస్ ను వినిపించే నేతలు మాత్రం ప్రజల ముందు తేలిపోతున్నారు. పార్టీ అంశాలను ప్రస్తావించేందుకు ఒకరు.. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేందుకు మరొకరు.. తమ ప్రభుత్వ హయాంలో బాగా పనిచేశామని చెప్పేందుకు ఇంకొందరు ఉన్నారు. అయితే వైసీపీలో పరిమిత స్థితిలోనే ప్రెస్మీట్లో మాట్లాడే వారు ఉంటారు. అయితే ఇలా మాట్లాడుతున్న వారి మాటల్లో మాత్రం పరిణితి లేదు. ప్రజలు గుర్తించే పరిస్థితి కూడా లేదు. అయినా సరే వారే పదే పదే మాట్లాడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. గంభీరమైన వాయిస్ కానీ.. ఏదో సందేశం ఇచ్చేలా మాట్లాడుతుంటారే కానీ సందేహాలను నివృత్తి చేయలేరు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీగా డ్యామేజ్ చేశారు.
రాజధానులే కారణం..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాజధానుల అంశం కూడా ఒక కారణం. అమరావతిని కాదని మూడు రాజధానులను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy). ప్రజలు ఈ విషయంలో వైసిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. అయినా సరే ఆ పార్టీ గుణ పాఠాలు నేర్చుకోలేదు. మొన్న మధ్యన పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి అనుకూల వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన అమరావతి నుంచి పాలన సాగిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన జగన్ చేతిలో చివాట్లు తిన్నట్లు తెలుస్తోంది. తాజాగా అంబటి రాంబాబు భిన్నంగా మాట్లాడారు. ప్రపంచంలో మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామంటే తప్పుపట్టారు. ముందు నగరమే లేకపోతే మహానగరం.. ప్రపంచంలోనే అద్భుతం అంటూ చెబుతున్నారంటూ అమరావతి పై సెటైరికల్ గా మాట్లాడారు. తద్వారా అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారలేదని అర్థమవుతుంది.
కదిలించలేని స్థితికి..
అమరావతి రాజధాని( Amravati capital ) ఆపడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం కాలేదు. రాజకీయంగా గత ఐదేళ్లలో అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది. తనకు నచ్చిన విధంగా మూడు రాజధానులను సైతం పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడు ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో చర్చించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. అమరావతికి చట్టబద్ధత వైపు అడుగులు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో కూడా అమరావతి పై విషయం చిమ్మితే అది ఆకాశం ఇటువంటి సమయంలో కూడా అమరావతి పై విషయం చిమ్మితే అది ఆకాశం పై ఉమ్ము వేసినట్టు అవుతుంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకో ఈ విషయంలో అంతు పట్టడం లేదు. అమరావతిని సమర్థించలేకపోవచ్చు కానీ.. వ్యతిరేకిస్తే మాత్రం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. పైగా అంబటి లాంటి వారితో అమరావతి గురించి మాట్లాడిస్తే మాత్రం భారీ డ్యామేజ్ అవుతుంది. అయితే ఈ డ్యామేజ్ లను గుర్తించే పనిలో లేదు వైయస్సార్ సిపి నాయకత్వం.