Priceless moment: మనల్ని మనకంటే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే దానిని అభిమానం అంటాం. అటువంటి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి కోట్లల్లో ఉంటారు. అతడు మాట్లాడే మాట.. ఆడే ఆట.. ఇలా విరాట్ కోహ్లీ చేసే ప్రతి పని అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది. ముఖ్యంగా అతడిలో ఉండే ఆవేశం అభిమానులకు సరికొత్త మజా అందిస్తుంది. అందువల్లే విరాట్ కోహ్లీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు పిచ్చిపిచ్చిగా ఆరాధిస్తుంటారు.
విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు అభిమానులు ఏడ్చేస్తుంటారు. తమ గుండెలు పగిలినంత బాధగా ఉందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే తామ ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ జట్టును గెలిపిస్తే భారతదేశాన్ని తమ భుజస్కందాల మీద మోసినట్టు భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప క్రికెటర్లు చాలామంది ఉంటారు. కానీ విరాట్ కోహ్లీకి భక్తులు ఉంటారు. అతడిని చూడాలని.. అతడితో మాట కలపాలని.. అతడి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని.. అతనితో కలిసి ఫోటోలు దిగాలని చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ భాగ్యం కొంతమందికి మాత్రమే దక్కుతుంది.
విరాట్ కోహ్లీ మైదానంలో ఆడుతుంటే ప్రత్యక్షంగా చూసి, తన్మయత్వం చెందేవారు కోట్లలో ఉంటారు. అయితే విరాట్ కోహ్లీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత అతడిని ఇంకా దగ్గరగా చూడాలని.. అతడి చేతిని తాకాలని.. అతడితో మాట్లాడాలని చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అత్యంత టైట్ సెక్యూరిటీ ని దాటి విరాట్ కోహ్లీని తాకడం గానీ.. మాట్లాడడం గాని సాధ్యం కాదు. అయితే అటువంటి అసాధ్యాన్ని ఓ వ్యక్తి సాధ్యం చేశాడు. దేవుడిని చూశాను అంటూ గొప్పగా ఫీల్ అయిపోయాడు.
రాంచి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ విరోచితంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ ప్రత్యక్షంగా మరింత దగ్గరగా చూడాలని అనుకున్నాడు. అంతే బారికేడ్ నుంచి అమాంతం మైదానంలోకి దూకేశాడు. పరుగులు పెట్టుకుంటూ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లాడు. విరాట్ కోహ్లీ పాదాలకు నమస్కరించాడు.. దేవుడిని చూసినట్టు చూసి.. తన జన్మ ధన్యమైంది అంటూ హావభావాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ దగ్గర నుంచి షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. అనంతరం మైదానం సెక్యూరిటీ వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. “నువ్వు ఎంత కష్టపడినా పర్వాలేదు.. మొత్తానికి క్రికెట్ గాడ్ ను చూసావని” ఆ అభిమానిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు.
That guy really lived the moment of his life. Virat Kohli is truly the god of this game. Every pitch invader who reaches him ends up touching his feet instead of going for a hug. And the smile on his face after… priceless. pic.twitter.com/5OWxsvgn4i
— U’ (@toxifyxe) November 30, 2025