Gautam Gambhir: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్(కేకేఆర్)కు మెంటార్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి షాక్ ఇచ్చారు. బీసీసీఐ సెక్రెటరీ జైషా ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. టీమిండియా తర్వాతి హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌ను నియమించారని మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది. బీసీసీఐ కూడా కొత్త కోచ్ జూలై 1న బాధ్యతలు చేపడతారని ప్రకటించింది. కానీ, ఇదంతా మీడియా హడావుడే అని అర్థమైంది. గంభీర్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. తాను కేకేఆర్ మెంటార్‌గానే కొనసాగుతానని స్పష్టం చేశారు.
లక్ష్యాన్ని స్పష్టం చేసిన గంభీర్..
ఇంటర్వ్యూలో గంభీర్ తన లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించారు. కేకేఆర్ ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచాని తెలిపారు. కేకేఆర్‌ను ఆరుసార్లు ఛాంపియన్‌గా, సక్సెస్‌ఫుల్ టీంగా నిలబెట్టడమే తన తర్వాతి లక్ష్యమని వెల్లడించారు.
ఇప్పుడే సక్సెస్ మొదలు..
కేకేఆర్ జట్టు సక్సెస్ ఇప్పుడే మొదలైందని గంభీర్ తెలిపారు. దానిని కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా గెలుపుతో సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ మాత్రం కాదని తెలిపారు. అలా నిలవాలంటే కేకేఆర్ ఇంకా మూడు టైటిళ్లు గెలవాలని పేర్కొన్నారు. అలా నిలిచినప్పుడు దక్కే ఫీలింగ్ కంటే మెరుగైనది ఏది లేదని స‍్పష్టం చేశారు. తద్వారా తాను బీసీసీఐ కోచ్ రేసులో లేనని క్లారిటీ ఇచ్చారు. ఆ పదవి కోరుకోవడం లేదని చెప్పకనే చెప్పారు.