Australia vs India : ఇటీవల యువ ఆటగాళ్లకు టీమిండియా ఎక్కువగా అవకాశాలు కల్పిస్తోంది. అలా అవకాశాలు దక్కించుకున్న ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉంటాడు. టి20 లలో ఇప్పటికే సత్తా చాటిన అతడు.. టెస్టులను తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. చేసింది 41 పరుగులు అయినప్పటికీ.. టీమిండియాలో టాప్ స్కోరర్ గా గెలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూనే.. తన వికెట్ ను కాపాడుకున్నాడు. మిగతా ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అవుతున్నప్పటికీ.. అతడు మాత్రం అలానే ఉండిపోయాడు. చివరికి ఆఖరి వికెట్ గా అవుట్ అయ్యాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 73 పరుగులకే ఆరు వికెట్లు పోయి తీవ్రమైన నష్టాల్లో పడిన సందర్భంలో నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టును ఆదుకున్నాడు.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి..
జట్టు పీకల్లోతు కష్టాల్లో పడటంతో డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి నితీష్ కుమార్ రెడ్డికి సందేశం వచ్చింది. దీంతో అతడి రక్తం మరిగిపోయింది.. ఫలితంగా అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.” బార్డర్లో సోల్జర్ ప్రత్యర్థుల బుల్లెట్ల ఈదురు దెబ్బలను కూడా తట్టుకుంటాడు. గట్టిగా నిలబడతాడు. అలాంటి బంతులు వస్తే ధైర్యంగా ఎదుర్కో. ఎదురుదాడికి దిగు.. అంటూ గౌతమ్ గంభీర్ తనకు సూచించాడని” బ్రిటిష్ పేర్కొన్నాడు. ఇక బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా గౌతమ్ గంభీర్ మాకో సలహా ఇచ్చాడు అని అతడు పేర్కొన్నాడు. బంతి ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లకు అదిరిపోయే సమాధానం చెప్పాలని సూచించాడని నితీష్ వివరించాడు. అందువల్లే టీమిండియా 150 పరుగులకు కుప్పకూలిపోయినప్పటికీ.. ప్రత్యర్థి జట్టును వణికించిందని.. 67 పరుగులకు 7 వికెట్లు తీసిందని.. నితీష్ వివరించాడు. నితీష్ చేసింది 41 పరుగులే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో అభిమానులు అతనిపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు.
7 వికెట్లు కోల్పోయింది
టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆ జట్టులో అలెక్స్ క్యారీ (19*) మాత్రమే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఉస్మాన్ ఖవాజా (8), మెక్ స్వీని(10), స్టీవెన్ స్మిత్ (0), కమిన్స్(3) వంటి ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. వీరంతా కూడా బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యారు. మిచల్ మార్ష్ (6), లాబూ సాగ్నే(2) వంటి ఆటగాళ్లు సిరాజ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నారు. హెడ్ హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.