Rohit Sharma: వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద ఇండియా మ్యాచ్ ఓడిపోవడం చూసిన అభిమానులు ఇప్పటికి కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు… ఎందుకు అంటే లీగ్ దశలో 9 విజయాలు సాధించిన ఇండియన్ టీమ్ ఇక తమకు ఎవరు పోటి లేరు, రారు అనేంత కాన్ఫిడెంట్ గా ముందుకు దూసుకువచ్చింది. ఇక అలాగే సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ ని చిత్తుగా ఓడించి ఇక టైటిల్ వేట లో ఫైనల్ లోకి అడుగు పెట్టింది. కానీ తీరా చూస్తే మాత్రం ఫైనల్ లో ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా మీద పెద్దగా ప్రభావం చూపించలేక చతికల పడిపోయింది…
ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పైన పలు రకాల విమర్శలు వస్తున్నాయి. అవి ఏంటి అంటే ఒకప్పుడు 2003 వ సంవత్సరంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇండియన్ టీం లో సౌరవ్ గంగూలీ ఎలాంటి తప్పయితే చేశాడో రోహిత్ శర్మ కూడా కెప్టెన్ గా అదే తప్పు చేశాడు అంటూ పెద్ద ఎత్తున రోహిత్ శర్మ పైన నెగెటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది… అదేంటి అంటే ఇండియన్ టీమ్ అల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్య కి గాయం అవ్వడం తో ఆయన వరల్డ్ కప్ నుంచి రూల్డ్ ఔట్ అయ్యాడు. ఇక దాంతో ఆయన ప్లేస్ లో బౌలర్ గా షమీ ని బ్యాట్స్ మెన్ గా సూర్య ని తీసుకోవాల్సి వచ్చింది. ఇక షమీ తనదైన రీతిలో వరుస వికెట్లు తీస్తూ రెచ్చిపోయాడు కానీ సూర్య మాత్రం అంత మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు…
ఇక ఇది ఇలా ఉంటే ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ అశ్విన్ ని టీమ్ లోకి తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఎక్స్ ట్రా స్పిన్నర్ గా తను ఇండియన్ టీం కి చాలా బాగా హెల్ప్ అయ్యేవాడు. అయితే అశ్విన్ ని టీం లోకి తీసుకుంటే సూర్య కుమార్ యాదవ్ ని గాని, లేదంటే మహమ్మద్ సిరాజ్ ని గాని పక్కన పెట్టాల్సి వస్తుంది.ఇక సిరాజ్ ను పక్కన పెట్టాల్సి వస్తే ఇద్దరు పేసర్లతోనే ఇండియా ముందుకుపోవాల్సి ఉంటుంది. ఒకవేళ సూర్య కుమార్ యాదవ్ ని కనక పక్కన పెట్టినట్లయితే బ్యాటింగ్ చాలా వీక్ అవుతుందనే ఒకే ఒక ఉద్దేశ్యం తో రోహిత్ శర్మ అశ్విన్ ని పక్కన పెట్టాడు…
ఇక ఇప్పుడు టీమ్ కి అదే మైనస్ అయిందంటూ చాలామంది రోహిత్ శర్మ ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే అశ్విన్ ఆఫ్ స్పిన్ వేస్తాడు కాబట్టి ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాచ్ మెన్స్ ని బాగా ఇబ్బంది పెడతాడు ఆస్ట్రేలియా టీం లో హెడ్ లెఫ్ట్ అండ్ ప్లేయర్ కాబట్టి ఆయన ఒక్కడే ఆస్ట్రేలియా టీమ్ యొక్క బ్యాటింగ్ బరువు మొత్తం మోసాడు.అలాగే ఆస్ట్రేలియా కి భారీ విజయాన్ని అందించాడు కాబట్టి అశ్విన్ కనక టీమ్ లో ఉంటే హెడ్ ని ఔట్ చేసేవాడు ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లను తొందరగా ఔట్ చేసేవాళ్ళేమో అందుకని అశ్విన్ కనక టీం లో ఉంటే అతన్ని ఇబ్బంది పెట్టి పక్క అతను వికెట్ అయితే తీసేవాడు అంటూ చాలా ముందు కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఇంతకుముందు 2003 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ కూడా అనిల్ కుంబ్లే ని పక్కన పెట్టి ఫైనల్ మ్యాచ్ ఆడడం జరిగింది..ఆ మ్యాచ్ లో రెచ్చిపోయిన రీకి పాంటింగ్ సెంచరీ చేసి వాళ్ల టీమ్ 359 భారీ పరుగులు సాధించడం లో కీలక పాత్ర వహించాడు… ఇక అప్పుడు కూడా ఇలానే ఇండియన్ టీమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది…