Team India captaincy: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించిన అయ్యర్.. తన ఆటలోకొత్తదానాన్ని ప్రదర్శించాడు. వాస్తవానికి అంతకుముందు అతడు జట్టులో అద్భుతమైన ఆట ప్రదర్శించినప్పటికీ.. రంజీలో ఆడలేదు అని కారణాన్ని చూపి.. భారత క్రికెట్ మేనేజ్మెంట్ గత ఏడాది అతడికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు ఇవ్వలేదు. పైగా అతనిని బి జి టి సిరీస్ కు ఎంపిక చేయలేదు. అయినప్పటికీ అయ్యర్ ఏమాత్రం బాధపడలేదు. పైగా రంజీలో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకుడిగా వ్యవహరించి.. జట్టును విజేతగా నిలిపాడు. దాదాపు దశాబ్దానికి మించి ఎదురుచూపుకు తెరదించి..కోల్ కతా ను ఛాంపియన్ గా అవతరించేలా చేశాడు. మొత్తంగా కోల్ కతా జట్టులో అమితమైన ఆనందాన్ని నిలిపాడు.
Also Read : శ్రేయస్ అయ్యర్.. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క సారధి!
ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రతిభ చూపిన నేపథ్యంలో.. శ్రేయస్ అయ్యర్ కు సెంట్రల్ కాంట్రాక్టులో బిసిసిఐ చోటు కల్పించింది. అయితే రోహిత్, కోహ్లీ అనుహ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ ను కెప్టెన్ చేస్తారని చర్చ మొదలైంది. అయితే గిల్ ను సారధిగా నియమిస్తూ బిసిసిఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.. గిల్ తో పోల్చి చూస్తే అయ్యర్ కు మెరుగైన రికార్డు ఉంది. పైగా అయ్యర్ కు మ్యాచ్ విన్నర్ అనే పేరు కూడా ఉంది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ అయ్యర్ ను సాధరణ ఆటగాడిగా కూడా పరిగణించకుండా జట్టులో చోటు కల్పించలేదు. పైగా జట్లు అన్ని స్థానాలు ఫిల్ అయ్యాయని.. అందువల్లే అయ్యర్ ను ఎంపిక చేయలేదని మేనేజ్మెంట్ సాకులు చెప్పింది.
గిల్ ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్లో గుజరాత్ జట్టు గ్రూప్ దశ నుంచే వెళ్లిపోయింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ప్రస్తుతం టాప్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. ఒకవేళ లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు గనుక విజయం సాధిస్తే.. గుజరాత్ స్థానం ప్రశ్నార్థకమవుతుంది. ఐతే ఇవన్నీ బీసీసీఐ పెద్దలకు తప్పు లాగా కనిపించలేదు. ఇన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నప్పటికీ బీసీసీఐ అయ్యర్ ను దూరం పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. “గొప్ప గొప్ప నాయకులకు సాధ్యం కాని రికార్డ్ అయ్యర్ సొంతం చేసుకున్నాడు. పెద్ద పెద్ద జట్లను కూడా ఓడించి తన జట్టును గెలిపించాడు. నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. అయినప్పటికీ అయ్యర్ ను లెక్కలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని” నెటిజన్లు అంటున్నారు.