IND vs AUS : రేపొద్దున టీమిండియాకు లక్కీ ఛాన్స్.. అద్భుతం జరిగితే తప్ప డ్రా దిశగానే నాలుగో టెస్ట్

– నాలుగో రోజు బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత బ్యాటర్లు – 186(364) పరుగులతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ – మరోసారి బ్యాట్ తో రాణించిన అక్షర పటేల్ – పర్వాలేదనిపించిన శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480/10 స్కోర్ సాధించగా, భారత్ ధీటుగానే బదులిచ్చింది. […]

Written By: BS, Updated On : March 12, 2023 6:20 pm
Follow us on

– నాలుగో రోజు బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత బ్యాటర్లు
– 186(364) పరుగులతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ
– మరోసారి బ్యాట్ తో రాణించిన అక్షర పటేల్
– పర్వాలేదనిపించిన శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా

IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480/10 స్కోర్ సాధించగా, భారత్ ధీటుగానే బదులిచ్చింది. ఆస్ట్రేలియా ఆల్ అవుట్ తర్వాత మూడో రోజు బ్యాటింగ్ ముగిసే సమయానికి భారత జట్టు 289-3తో పటిష్ట స్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు, జడేజా 16 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే, నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికి రవీంద్ర జడేజా 28(84) వికెట్ భారత్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ దిగిన శ్రీకర్ భరత్ తో కలిసి విరాట్ కోహ్లీ బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత శ్రీఖర్ భరత్ 44(88) పరుగులు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అక్షర పటేల్ బ్యాట్ చూపించడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. అక్షర పటేల్ పెద్ద షాట్లు ఆడడంతో స్కోర్ బోర్డు వేగంగా పరిగెత్తింది. 113 బంతుల్లో 79 పరుగులు చేసిన అక్షర పటేల్ ఇందులో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లను బాదాడు. కోహ్లీ – అక్షర పటేల్ ఆరో వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. అక్షర పటేల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన అశ్విన్, ఉమేష్ యాదవ్, కోహ్లీ వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ 571 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగిసినట్టు అయింది.

-కోహ్లీ వన్ మ్యాన్ షో..

మూడో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 59 పరుగులు చేశాడు. నాలుగో రోజు ఆట ప్రారంభమైన తర్వాత నెమ్మదిగా బ్యాటింగ్ ఆడిన కోహ్లీ ఆ తర్వాత క్రమంగా బ్యాట్ జులిపించడంతో భారీ స్కోర్ సాధించాడు. 139 వ ఓవర్లో లియాన్ బౌలింగ్లో సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ తన కెరీర్లో 75వ సెంచరీని సాధించాడు. 241 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న కోహ్లీ.. ఈ క్రమంలో ఐదు ఫోర్లు మాత్రమే బాధడం గమనార్హం. టెస్టుల్లో తాజా సెంచరీని సాధించేందుకు విరాట్ కోహ్లీ 1205 రోజులు పాటు నిరీక్షించాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇది 28వ సెంచరీ కాగా, ఓవరాల్ గా 75 వ సెంచరీ. సెంచరీ తర్వాత స్పీడ్ పెంచిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత 123 బంతుల్లోనే 86 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 10 ఫోర్ లను విరాట్ కోహ్లీ బాదాడు.

-లియాన్, ముర్పీకి మూడేసి వికెట్లు..

ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే లియాన్, ముర్ఫీ మూడేసి వికెట్లు సాధించగా, స్టార్క్, కోహనా మాన్ ఒక్కో వికెట్ సాధించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు మూడు పరుగులు చేసింది. ప్రస్తుతం కుహనా మాన్ 18 బంతుల్లో 0, ట్రావెస్ హెడ్ 18 బంతుల్లో మూడు పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

-డ్రా దిశగా..

ప్రస్తుతం ఇరు జట్ల బ్యాటింగ్ సామర్థ్యం బట్టి చూస్తే నాలుగో టెస్ట్ ఆయన అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప డ్రా అయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రేపొద్దున్న సెషన్ టీమిండియాకు చాలా కీలకం. ఆస్ట్రేలియాను ఓ 100 లోపు ఆలౌట్ చేస్తే.. సాయంత్రం వరకూ దాన్ని ఛేజ్ చేయవచ్చు. ప్రస్తుతం భారత జట్టు 88 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర పటేల్ మాయాజాలం చేస్తే భారత జట్టు విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అయితే ఈ పిచ్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. దీంతో నాలుగో రోజు ఆట ఏ విధంగా సాగుతుందన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది.