Ind Vs pak T20 World Cup: పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమికి కారణాలు ఇవే?

Ind Vs pak T20 World Cup: ఎంతో ఊహించుకున్నాం.. ప్రపంచకప్ లో టీమిండియాను కొట్టే దమ్ము పాకిస్తాన్ కు లేదనుకున్నాం.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ దేశ జట్టుకు అంత సీన్ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా విశ్లేషకులు అంతా భారత్ దే విజయం అన్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ రెచ్చిపోయింది. భారత్ ను చిత్తూ చేసింది. టీమిండియా ఇంత ఘోరంగా ఓడిపోవడం చూసి సగటు భారతీయుడి గుండె వలవల ఏడ్చేసింది. ప్రపంచకప్ […]

Written By: NARESH, Updated On : October 25, 2021 8:50 am
Follow us on

Ind Vs pak T20 World Cup: ఎంతో ఊహించుకున్నాం.. ప్రపంచకప్ లో టీమిండియాను కొట్టే దమ్ము పాకిస్తాన్ కు లేదనుకున్నాం.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ దేశ జట్టుకు అంత సీన్ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా విశ్లేషకులు అంతా భారత్ దే విజయం అన్నారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ రెచ్చిపోయింది. భారత్ ను చిత్తూ చేసింది. టీమిండియా ఇంత ఘోరంగా ఓడిపోవడం చూసి సగటు భారతీయుడి గుండె వలవల ఏడ్చేసింది. ప్రపంచకప్ దక్కకపోయినా.. వేరే ఏ జట్టు చేతిలో ఓడినా కూడా ఇంత బాధ పడి ఉండేవారు కాదు. కానీ పోయి పోయి శత్రుదేశం చేతిలో చిత్తవడం చూసి భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. భారత క్రికెటర్లపై దుమ్మెత్తి పోస్తున్నారు.

india pakistan

గత చరిత్రను తిరగరాస్తూ అదిరిపోయే ఆటతో పటిష్ట భారత్ ను పాకిస్తాన్ మట్టికరిపించింది. టాస్ నుంచి మ్యాచ్ ముగిసే వరకూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన పాక్ 10 వికెట్ల తేడా భారత్ ను చిత్తు చేసింది. పాక్ ఆధిపత్యం ముందు భారత్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

మహా భారతంలో కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమికి అన్నే కారణాలున్నాయి. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ముగిసే వరకూ ఏదీ కలిసిరాలేదు. ఓవైపు దురదృష్టం భారత ఆటగాళ్లపై శివతాండవం చేస్తే మరోవైపు పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్ జట్టు పతనాన్ని శాసించింది. ముఖ్యంగా నాలుగు కారణాలు భారత్ ను పాకిస్తాన్ చేతిలో ఓడించాయి.

*టాస్ ఓడిపోవడం భారత్ కు పెను శాపమైంది. టీం ఫలితాన్ని అదే శాసించింది. రెండో ఇన్నింగ్స్ లో మంచు కురిసి బాల్ గ్రిప్ దొరక్క భారత బౌలర్లు ఇబ్బంది పడితే.. తొలి ఆఫ్ లో బౌలింగ్ తో పాక్ స్వింగ్ రాబట్టి భారత్ ను చావుదెబ్బ తీసింది. టాస్ ఓడిపోవడమే భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మ్యాచ్ అనంతరం కోహ్లీ క ూడా చెప్పాడు.

*భారత జట్టుకు బలం బలగం అంతా టాప్ 3 బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇందులో రోహిత్ శర్మ (0) డకౌట్ కావడం.. కేటీఆర్ రాహుల్ ఒక్క పరుగుకే క్లీన్ బౌల్డ్ కావడం భారత్ కు శాపమైంది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం భారత్ ఆదిలోనే మ్యాచ్ కోల్పోవడానికి కారణమైంది. పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం కూడా కారణం. 150 వరకే టీమిండియా పరిమితమైంది. చివరి 5 ఓవర్లలో హార్ధిక్ పాండ్యా పరుగులు చేయలేకపోయాడు. 180 చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

*చెత్త బౌలింగ్ కూడా టీమిండియా ఓటమికి కారణం. 150 పరుగులకు పైగా లక్ష్యాన్ని పాకిస్తాన్ ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్లే చేధించేశారంటే భారత బౌలింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా, షమీ, భువనేశ్వర్, వరుణ్ చక్రవర్తి, జడేజా అంతా కట్టకట్టుకొని విఫలమయ్యారు.

*పాకిస్తాన్ కెప్టెన్, ఓపెనర్ పట్టుదల
భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పరంపరను బ్రేక్ చేయాలన్న కసి , పంతంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్, ఓపెనర్ రిజ్వాన్ కసితో ఆడి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. పేలవ షాట్లకు పోకుండా సింపుల్ గా మ్యాచ్ ను ముగించింది. తమ ప్రణాళికలు పర్ఫెక్ట్ గా అమలు చేసింది.

మొత్తం కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు టీమిండియాకు పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఏదీ కలిసిరాలేదు. అదే ఈ దారుణ ఓటమికి కారణమైంది. భారత క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది.