Homeక్రీడలుShubman Gill: భవిష్యత్ లో భారత క్రికెట్ ను ఏలే మొనగాడు అతడే..!

Shubman Gill: భవిష్యత్ లో భారత క్రికెట్ ను ఏలే మొనగాడు అతడే..!

Shubman Gill: టీమిండియా యువ ప్లేయర్ సుబ్ మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో కూడా అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ లోను తన సత్తాను చాటుతూ భారత క్రికెట్ జట్టుకు భవిష్యత్ కారణంగా కనిపిస్తున్నాడు. అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ మూడు ఫార్మాట్లలో కూడా అదరగొడుతున్నాడు ఈ యంగ్ క్రికెటర్. అన్ని ఫార్మాట్లలో సీనియర్ ఆటగాళ్ల స్థానాన్ని ఈ డాషింగ్ ఓపెనర్ భర్తీ చేశాడు అంటే ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

భారత క్రికెట్ జట్టులోని యంగ్ క్రికెటర్లు అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు గిల్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తనదైన శైలిలో దూకుడు అయిన ఆటతీరుతో అదరగొడుతుంటాడు ఈ యంగ్ గన్. భారత జట్టును భవిష్యత్తులో ఏలే అవకాశం ఉన్న ఆటగాడిగా పలువురు గిల్ గురించి వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా గిల్ పై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ కు అపారమైన నైపుణ్యంతో పాటు టెంపర్ మెంట్ ఉందని, పరిస్థితులకు తగ్గట్టు దూకుడుగా ఆడే సామర్థ్యం ఉందంటూ స్పష్టం చేశాడు రాథోడ్. టీమిండియా బ్యాటింగ్ ను అతను శాశిస్తాడని, తరపున మూడు ఫార్మాట్ లో సుదీర్ఘకాలం పాటు అతను ఆడే అవకాశం ఉందని విక్రమ్ రాథోడ్ జోష్యం చెప్పాడు. విక్రమ్ రాథోడ్ మాత్రమే కాదు.. అనేక మంది సీనియర్ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతమైన నైపుణ్యం.. అంతకుమించిన వేగం..

భవిష్యత్తులో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం గిల్ కు ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే గిల్ కూడా అన్ని ఫార్మాట్లలోను రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లో నైపుణ్యం తోపాటు టెక్నిక్, అంతకుమించిన వేగంతో జట్టులో కీలక ఆటగాడిగా గిల్ మారుతున్నాడు. ఇప్పటివరకు 17 టెస్టులు ఆడిన 58.34 స్ట్రైక్ రేటు, 32 యావరేజ్ తో 927 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు 24 వన్డేలు ఆడిన గిల్.. 107.11 స్ట్రైక్ రేట్, 66 యావరేజ్ తో 131 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 208 పరుగులు కాగా, నాలుగు సెంచరీలు, ఐదు ఉన్నాయి. అలాగే ఆరు అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడిన గిల్ 40 యావరేజ్ తో 202 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 126 పరుగులు కాగా, ఒక సెంచరీ మాత్రమే ఉంది. గణాంకాలు పరంగా చూసినా గిల్ అద్భుతమైన ప్రతిభతో అదరగొడుతున్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన ఉన్న ఆటగాడిగా పలువురు క్రికెటర్లు ఆడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular