Sunil Gavaskar: టీమిండియా కెప్టెన్లపై విమర్శలు రావడం సహజమే. దీనికి ఎవరు అతీతులు కారు. ఏ కెప్టెన్ అయినా విమర్శలు ఎదుర్కొన్నవారే. గంగూలీ, సచిన్, విరాట్ కెప్టెన్ ఎవరైనా విమర్శలు రావడం సాధారణమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సైతం విమర్శల దాడి పెరుగుతోంది. ఐపీఎల్ లో అడి ప్రదర్శన పేలవంగా ఉందని ప్రముఖ కామెంటర్ సునీల్ గవాస్కర్ నిట్టూర్చారు.
వరుస మ్యాచులతో..
విశ్రాంతి లేకుండా వరుసగా మ్యాచ్ లు ఆడటంత రోహిత్ కు విశ్రాంతి కావాలని సూచించాడు. తన ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని చెప్పాడు. రోహిత్ కు ప్రస్తుతం రెస్ట్ అవసరం. అతడు ప్రపంచ టెస్ట్ చాంపియన్ గురించి ఆలోచించాలి. ఐపీఎల్ లో ఆడటం గురించి సూచిస్తున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ పరుగులు రాబట్టడంలో వెనుకబడిపోతున్నాడు. రోహిత్ శర్మ ఆడటం ఆపేస్తేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఎందుకు అలా?
పరుగులు ఎందుకు సాధించడం లేదు. ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నా తన బ్యాట్ ఝళిపించడంలో ముందుకు రావడం లేదు. ఫలితంగా ముంబై ఇండియన్స్ కు ఓటములు పలకరిస్తున్నాయి. దీనిపై సునీల్ గవాస్కర్ రోహిత్ మిగతా మ్యాచులకు దూరంగా ఉండి చివరి మ్యాచులకు అందుబాటులో ఉంటే మంచిదని సలహా ఇస్తున్నాడు.
తడబాటు ఎందుకో?
2021 సీజన్ లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ప్లే ఆప్స్ అవకాశం తప్పింది. 2022 సీజన్ లో పది మ్యాచ్ ల్లో ఓడి ఆఖరి స్థానంలో నిలిచారు. 2023 సీజన్ లో కూడా కెప్టెన్ గా రాణించడం లేదు. మూడు మ్యాచ్ ల్లో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్ తరఫున ఒకే అర్ధ సెంచరీ చేయడం గమనార్హం. దీంతో రోహిత్ కు రెస్ట్ కావాలని గవాస్కర్ సూచిస్తున్నాడు. అతడికి రెస్ట్ ఇచ్చి చివరి మ్యాచుల్లో ఆడించాలని చెబుతున్నాడు.