FIFA World Cup 2022 : గెలిచిన తర్వాత అర్జెంటీనా ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా? వైరల్ వీడియో

FIFA World Cup 2022 : ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫిఫా ఫుట్ బాల్ కప్ కలను అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ నెరవేర్చుకున్నాడు. ఫైనల్ లో దుమ్మురేపే ఆటతో తన జట్టుకు గోల్స్ అందించాడు. విజయంలో కీలక పాత్ర పోషించి తన జట్టును స్వప్నాన్ని.. తన కలను నెరవేర్చుకున్నాడు. గత ఫిఫా చాంపియన్ అయిన ఫ్రాన్స్ ఎక్కడా తగ్గకుండా ఆడింది. దీంతో ఫైనల్ రెండు కొదమ సింహాలు లాంటి జట్ల మధ్య నువ్వా నేనా […]

Written By: NARESH, Updated On : December 19, 2022 11:17 am
Follow us on

FIFA World Cup 2022 : ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫిఫా ఫుట్ బాల్ కప్ కలను అర్జెంటీనా స్టార్ స్ట్రైకర్ లియోనెల్ మెస్సీ నెరవేర్చుకున్నాడు. ఫైనల్ లో దుమ్మురేపే ఆటతో తన జట్టుకు గోల్స్ అందించాడు. విజయంలో కీలక పాత్ర పోషించి తన జట్టును స్వప్నాన్ని.. తన కలను నెరవేర్చుకున్నాడు. గత ఫిఫా చాంపియన్ అయిన ఫ్రాన్స్ ఎక్కడా తగ్గకుండా ఆడింది. దీంతో ఫైనల్ రెండు కొదమ సింహాలు లాంటి జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగింది.

అనేక మలుపులు.. చివరి నిమిషాల్లో గోల్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ చివరకు స్కోర్లు సమం అయ్యి పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఇందో 4-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

అభిమానులను ఉర్రూతలూగించేలా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ అందరినీ మునివేళ్లపై నిలుచునేలా చేసింది. అర్జెంటీనా తరుఫున మెస్సీ రెండు గోల్స్ కొట్టగా.. డిమారియా ఓ గోల్ సాధించాడు. ఫ్రాన్స్ తరుఫున స్టార్ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫ్రాన్స్ తరుఫున మొత్తం మూడు గోల్స్ అతడే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు.

ఫ్రాన్స్ పై ఫైనల్ లో గెలిచి అర్జెంటీనా మూడున్నర దశాబ్ధాల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఎన్నో క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గెలవడంతో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి కల కూడా సాకారమైంది.

https://www.youtube.com/watch?v=4ryUZ3VvlzM

ఈ విజయం అనంతరం అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్ లో ఆ జట్టు సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ కూడా ట్రెండింగ్ మారాయి.