Sunrisers Hyderabad: ఒకప్పుడు సన్ రైజర్స్‌కు ఫ్యాన్స్ ఫుల్ సపోర్టుగా ఉండేవారు. కానీ ఎప్పుడతై టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్‌ను వదులకుందో అప్పటి నుంచే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఈ విమర్శలు ఉన్నా.. వార్నర్‌ను వదులుకున్నప్పటి నుంచి ఇవి ఎక్కువయ్యాయి. పైగా ఈ మధ్య కంప్లయింటు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు.
ఇందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ వేలంలో గెలుపు గుర్రాలను వదులకుంది. చాలామంది స్ట్రాంగ్ ప్లేయర్లను చేజిక్కించుకోలేకపోయింది. అదే సమయంలో జట్టులో కాస్తా కూస్తో ఆడే వారిని కూడా వదులుకుంది. దీంతో ట్విట్టర్ వేదికగా వేలం జరిగిన రోజే సన్ రైజర్స్ టీమ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పైగా అంతకు ముందు సీజన్లలో ఏ మాత్రం ఆకట్టుకోలేని వారిని కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సడెన్ గా ఇప్పుడు సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ మీద ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి ఇప్పుడేమైనా టీమ్ గెలిచిందా అంటే ఆ విషయంలో కాదండోయ్. ఇద్దరు ప్లేయర్లను వదులుకున్నందుకు. అవును. గతంలో సన్ రైజర్స్ జట్టులో అతి దారుణంగా ఫెయిల్ అయి గెలవాల్సిన మ్యాచ్‌లను ఓడిపోయేందుకు కారణం అయిన విజయ్ శంకర్, మనీష్ పాండేలను వేలంలో వదిలేసింది.
అదే ఇప్పుడు జట్టును కాపాడిందని అంటున్నారు. ఎందుకంటే వారిద్దరూ ఇప్పుడు వేర్వేరు టీమ్ లలో ఆడుతున్నారు. కానీ ఏ మాత్రం ఆకట్టుకోవట్లేదు. విజయ్ శంకర్ గుజరాత్ టైటాన్స్ తరఫున మనీష్ పాండే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నారు. కానీ వారి ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. దారుణంగా విఫలమవుతున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ వన్ డౌన్‌లో వచ్చి 20 బంతుల్లో 13 రన్స్ మాచేశాడు. బౌలర్ గా కూడా ఆకట్టుకోలేకపోయాడు.
అలాగే లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లో ఆడుతున్న మనీష్ పాండే కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులు, అలాగే చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కేవలం 5 పరుగులు చేశాడు. దాంతో వీరిద్దరూ సన్ రైజరస్ టీమ్ లో లేనందుకు ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. వారు గనక ఉంటే.. పరిస్థితి మరీ దారుణంగా ఉండేదంటూ చెబుతున్నారు.