Salaries Not Getting AP Employees: అప్పుల్లో ఉన్న సంసారాన్ని గట్టున పడేయాలంటే.. ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి. అంతేకానీ గొప్పలు పోయి మరిన్ని అప్పులు చేస్తే పరిస్థితి చేయి దాటి పోతుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే ఇది నిజం అనిపిస్తుంది. ఇప్పటికి ఏపీ అప్పుల భారం రోజురోజుకూ మితిమీరిపోతోంది. ఇలాంటి సమయంలో ఆర్థిక మూలాలను పటిష్టం చేసి ఉపాధి అవకాశాలను పెంచితే తప్ప అప్పుల భారం నుంచి తప్పించుకోలేరు. కానీ జగన్ ప్రభుత్వం అలాంటివేమీ ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ చివరకు ఉద్యోగులను కూడా ఇబ్బందుల్లో పెడుతుంది.
ప్రభుత్వ తీరు వల్ల ఉద్యోగులు టైంకు జీతాలు పడక నానా అవస్థలు పడుతున్నారు. ఈరోజు 3వ తేదీ. వాస్తవానికి ఒకటో తేదీనే జీతాలు పడిపోవాలి. కానీ ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు పేరిట అప్పులోల్లు వచ్చి పీకల మీద కూర్చోవడంతో.. ఉన్న నిధులన్నీ వారికి బిల్లులను చెల్లించింది. చివరకు పంచాయతీ నిధులను కూడా మల్లించేసి అప్పులోళ్లకు కట్టింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే రూ.5 వేల కోట్లు కావాలి. ఇప్పటికిప్పుడు అంత ఆదాయం అంటే రాదు.
కాబట్టి మళ్లీ అప్పులవైపే చూడాలి. ఆర్బీఐ వద్ద బాండ్లను వేలం వేసి అప్పులు తేవాలని ప్రభుత్వం చూస్తుంది. పైగా ఆర్థిక సంవత్సరంలో చేస్తున్న మొదటి అప్పు కాబట్టి కేంద్రం కూడా త్వరగానే పర్మిషన్ ఇస్తుంది. ఇది ఎంత వరకు కరెక్ట్.. పదేపదే అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వడం అంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్టే అవుతుంది. రోజురోజుకూ ఏపీలో అప్పుల భారం పెరుగుతూనే ఉంది తప్ప ఏ మాత్రం తగ్గటం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఆర్థిక సంక్షోభం ఏపీలో కూడా వస్తుందని అని అంటున్నారు ఏపీ ప్రజలు.
ఇవన్నీ కూడా జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే జరుగుతున్నాయని అంటున్నారు. ఎంతసేపు సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి శూన్యం అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి మార్గాలు పెంచకపోవడం వల్లే రాష్ట్ర ఆర్థిక ఆదాయాలు తగ్గిపోతున్నాయంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా యువతకు ఉపాధి మార్గాలు పెంచి రాష్ట్రానికి ఆదాయాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Celebrities Arrested: రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్.. ఆ హీరో, ఆ నిర్మాత కూతురు కూడా