Paris Olympics 2024: విశ్వ క్రీడలుగా ప్రసిద్ధి చెందిన ఒలింపిక్స్ క్రీస్తుపూర్వం 776లోనే ప్రారంభమయ్యాయి. తర్వాత 393లో నిలిపివేశారు. తర్వాత 1896లో ఏథెన్స్‌లో పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచ యుద్ధాక కారణంగా అంతరాయకం ఏర్పూడింది. ప్రాచీనకాలంలో జరిగిన ఒలింపిక్స్‌ను ప్రాచీన ఒలింపిక్స్‌గా.. పునఃప్రారంభం తర్వాత జరుగుతున్న ఒలింపిక్స్‌ను ఆధునిక ఒలింపిక్స్‌గా పిలుస్తున్నారు. ఆధునిక ఒలింపిక్స్ క్రీడలకు ముఖ్య కారకుడు ఫ్రాన్స్ దేశానికి చెంది పియరె డి. కోబర్టీన్. 1924 నుంచి శీతాకాల ఒలింపిక్స్ కూడా ప్రారంభమయ్యాయి. 1896లో ప్రారంభమైన ఒలింపిక్స్‌ను సమ్మర్ ఒలింపిక్స్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 2020లో జపాన్‌లోని టోక్కోలో ఒలింపిక్స్ నిర్వహించారు. ఇక ప్రస్తుత ఒలింపిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నార. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఆగస్టు 11 వరకు ఈ ఒలింపిక్స్ జరుగుతాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో చైనా అత్యధికంగా 13 గోల్డ్ మెడల్స్ గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. 200లకుపైగా దేశాల క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో ఎప్పుడూ 30వ స్థానంపైగానే ఉంటుంది. ప్రపంచంలో జనాభాలో రెండోస్థానంలో ఉన్న చైనా పాయింట్ల పట్టికలో ఉండగా, భారత్ మాత్రం వెనుకబడింది. ఇక మన జనాభాలో 10 వంతు కూడా లేని జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, నెదర్లాండ్, సౌత్ కొరియా, రొమేనియా, హంగేరీ వంటి దేశాలు కూడా టాప్ 10 లో ఉంటున్నాయి. మన క్రీడాకారులు నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నా.. పథకాల వేటలో మాత్రం వెనుకబడుతున్నారు.
ఎవరిని నిందించాలి..
మన దేశంతో సత్తా చాటిన క్రీడాకారులను ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓసీ) ఒలింపిక్స్ పోటీలకు ఎంపిక చేస్తుంది. సొంత గడ్డపై, ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్న మన క్రీడాకారులు విశ్వ వేదికపై మాత్రం చతికిల పడుతున్నారు. ఇంట్లో పులి.. వీధిలో పిల్లిలా ఉంది మన క్రీడాకారుల పరిస్థితి. దీనికి క్రీడాకారులను నిందించాలా… ఎంపిక చేసిన ఐవోసీని నిందించాలా.. పాలకులను నిందించాలా అంటే.. అందరినీ నిందించాల్సిందే. చదువులపై చూపుతున్న శ్రద్దను ఆటలపై మన యువత చూపడం లేదు. తల్లిదండ్రులు కూడా క్రీడలకన్నా చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో మెలకువలు నేర్చుకోవాల్సిన పిల్లలు.. అవి అంటే ఏమిటో కూడా తెలియకుండానే పెరిగి పెద్దవుతున్నారు. ఇందుకు మన పాలకులను నిందించాలి. ఇక పాఠశాలల్లో ఆటలు నేర్పించకపోయినా.. ఎందుకు నేర్పించడం లేదని అడగని తల్లిదండ్రులను నిందించాలి. క్రీడలకు సమయం ఇవ్వని విద్యా సంస్థలను నిందించాలి.. ప్రపంచస్థాయి సత్తా లేకపోయినా.. క్రీడాకారులను ఎంపిక చేస్తున్న ఐవోసీని కూడా నిందించాలి.
కానరాని క్రీడా మైదానాలు..
ఒకప్పుడ పాఠశాలల్లో పిల్లలకు ప్రతీ రోజు ఆటల పిరియడ్ ఉండేది. వారంలో ఐదు రోజులు ఉపాధ్యాయులు ఆటలు ఆడించేవారు. మరో రోసు ఆర్ట్, క్రాఫ్ట్ నేర్పించేవారు. ఇలా పిల్లలు తమకు నచ్చిన ఆటపై పాఠశాల స్థాయిలోనే ఆసక్తి పెంచుకునేవారు. తర్వాత ఫలితాల ఒత్తిడితో పాఠశాలల యాజమాన్యాలు క్రీడా తరగతులను వారానికి ఐదు నుంచి మూడుకు తగ్గించారు. తర్వాత వారానికి ఒకటి చేశారు. ఇప్పుడు మొత్తానికే ఎత్తేశారు. ఆగస్టు 15, జనవరి 26 సందర్భంగా మాత్రమే ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో క్రీడాకారులకు ఆటలపై పెద్దగా ఆసక్తి ఉండడం లేదు.
క్రికెట్ వచ్చాక..
హాకీ.. మన జాతీయ క్రీడ, కబడ్డీ.. మన రాష్ట్ర క్రీడ.. కానీ ఈ ఆటల గురించి చాలా మందికి తెలియదు. క్రికెట్ వచ్చాక.. మన క్రీడలను కూడా మనం మర్చిపోతున్నాం. క్రికెట్ మోజులో పడి మిగతా క్రీడలపై ఆసక్తి చూపడం లేదు. ప్రంచం వ్యాప్తంగా అనేక క్రీడలు ఉన్నాయి. ఫుట్‌బాల్, టెన్నిస్, బ్యడ్మింటన్, స్విమ్మింగ్, రన్నింగ్, వాకింగ్ ఇలా అనేక క్రీడలు ఉన్నాయి. వీటిగురించి అయితే చాలా మందికి తెలియదు. కాదు. తెలియకుండా చేస్తున్నారు మన విద్యాశాఖ అధికారులు, పాలకులు, తల్లిదండ్రులు. శారీరక శ్రమ లేకుండా పిల్లలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. మైదానం అంటే కూడా తెలియకుండా పెంచుతున్నారు.
ఇలాగే కొనసాగితే..
తల్లిదండ్రుల నుంచి పాలకుల వరకు అందరూ క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా క్రీడలకు భావితరాలు దూరమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ఆడేందుకు పట్టుమని పది మంది కూడా దొరకరు. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ మినహాయిస్తే చాలా క్రీడలకు భారత దేశంలో స్థానమే లేకుండా పోయింది. మరి దీనిపై మనమే ఆలోచన చేయాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More