https://oktelugu.com/

ENG Vs SL: టెస్ట్ లలో టీ -20 లాగా ఆడుతున్నాడు.. ఇతడుంటే ఇంగ్లాండ్ WTC గద గెలవడం పక్కా

సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శిస్తారు. ఓవర్లకు ఓవర్లు క్రీజ్ లో ఉంటూ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తారు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతారు. కానీ ఈ ఆటగాడు అలా కాదు. టెస్ట్ లలో టి20 ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఇతడు జోరు చూసి సీనియర్ క్రికెటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 4:25 pm
ENG Vs SL

ENG Vs SL

Follow us on

ENG Vs SL: ఇంగ్లాండ్ జట్టు స్వదేశంలో ప్రస్తుతం శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచింది. రెండవ టెస్టులోనూ విజయం సాధించేందుకు ప్రయత్నాలు సాధిస్తోంది. ఇప్పటికే రెండవ టెస్ట్ మ్యాచ్ పై పట్టు బిగించింది. ఏ క్షణమైనా శ్రీలంక జట్టును మట్టికరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. సొంత మైదానం కావడం.. బౌలర్లు పూర్తిస్థాయి ఫామ్ లో ఉండడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఎదురనేదే లేకుండా పోతోంది.. అయితే రెండవ టెస్టు మ్యాచ్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లాండ్ గస్ అట్కిన్సన్ గురించి.. ఇతడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. శ్రీలంక బౌలర్ల పై శివతాండవం చేశాడు. 103 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.. ఇతడి ఇన్నింగ్స్ లో నాలుగు బౌండరీలు ఉంటే.. సిక్సర్లు ఏకంగా 12 దాకా ఉన్నాయి.. గస్ అట్కిన్సన్ 118 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ముగించాడు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో గస్ అట్కిన్సన్ తన పేరును లిఖించుకున్నాడు.

రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 427 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇలాంటి బ్యాటర్ జో రూట్ అద్భుతమైన సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.. మరో ఏడు పరుగులు చేసి ఉంటే 150 రన్స్ చేసి ఉండేవాడు.. రూట్ తర్వాత 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన గస్ అట్కిన్సన్ సత్తా చాటాడు. 103 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గస్ అట్కిన్సన్ రూట్ తో ఏడో వికెట్ కు 111 బంతుల్లో 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో ఆటగాడు మాథ్యూ పాట్స్ తో కలిసి 97 బంతుల్లో 85 పరుగులు జత చేశాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ లోనూ గస్ అట్కిన్సన్ సిద్ధహస్తుడు. జూలై 10న లార్డ్స్ లో జరిగిన మ్యాచ్ ద్వారా గస్ అట్కిన్సన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్ తో జరిగిన ఆ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టాడు. రెండవ ఐదు వికెట్లు సాధించాడు. మొత్తంగా లార్డ్స్ మైదానంలో 10 వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో గస్ అట్కిన్సన్ స్థానం సంపాదించుకున్నాడు.

మూడు టెస్టుల ఈ సిరీస్ లో తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. సిరీస్లో కష్టంగా నిలబడాలంటే గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక జట్టు తడబడుతోంది.. రెండో టెస్టులో ఆ జట్టు ఓటమి అంచున నిలిచింది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ సీరియస్ జరుగుతున్న నేపథ్యంలో.. ఇందులో సాధించే విజయాలు ఇంగ్లాండ్ జట్టు భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది.. ఒకవేళ వరుస విజయాలు సాధిస్తే ఆ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనాన్స్ ఆడే అవకాశాన్ని కొట్టి పారేయలేం..గస్ అట్కిన్సన్ ఇదే జోరు కొనసాగిస్తే ఇంగ్లాండ్ ఆ ఘనత సాధించడం సాధ్యమవుతుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.