England Vs Netherlands: ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న ఇంగ్లాండ్…

340 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీం ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి తట్టుకోలేక 179 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక దాంతో ఈ టోర్నీ లో ఇంగ్లాండ్ రెండో విజయాన్ని అందుకుంది.

Written By: Gopi, Updated On : November 9, 2023 9:14 am

England Vs Netherlands

Follow us on

England Vs Netherlands: డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ ఈ వరల్డ్ కప్ లో వరుస ఓటమిలను చవి చూస్తు వస్తుంది.పసికూన లు అయిన ఆఫ్గనిస్తాన్ నెదర్లాండ్స్ లాంటి టీమ్ లు సైతం అన్నో ఎన్నో విజయాలను అందుకుంటుంటే ఇంగ్లాండ్ టీం మాత్రం వరుసగా ఓటులను చవి చూస్తూ వచ్చింది.ఇక ఈరోజు నెదర్లాండ్స్ టీమ్ ఆడిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ చాలా రోజుల తర్వాత సెంచరీ చేసి అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. ముఖ్యం గా ఆయన చేసిన బ్యాటింగ్ కి నెదర్లాండ్స్ బౌలర్లు మొత్తం భయం తో వణికిపోయారు. గ్రౌండ్ లో నలుదిక్కుల షాట్స్ కొడుతూ ఆయన ఆడిన ఆట తీరుకి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు… ఇలా ఆయన ఒక భారీ ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ టీం నిర్ణీత 50 ఓవర్లకి 339 పరుగులు చేసింది. ఇక దాంతో ఇంగ్లాండ్ టీంకి ఈ టోర్నిలో ఇదే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం…

ఇక 340 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీం ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి తట్టుకోలేక 179 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక దాంతో ఈ టోర్నీ లో ఇంగ్లాండ్ రెండో విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.ఇక తర్వాత ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో ఒక మ్యాచ్ లో తలపడనుంది… ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మీద గనుక విజయం సాధించినట్లయితే ఇంగ్లాండ్ తో పాటుగా పాకిస్తాన్ కూడా ఇంటికి పోవాల్సిందే…

ఇక ఇంగ్లాండ్ టీం అభిమానులు మాత్రం వరుస ఓటమిల తర్వాత ఇంగ్లాండ్ విజయాల బాట పట్టింది అని ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ టోర్నీ లో ఒక విజయాన్ని మాత్రమే సాధించి పాయింట్స్ టేబుల్ లో చివరి పొజిషన్ లో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ రెండో విజయాన్ని అందుకోగలిగిందని ఇంగ్లాండ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరు ఊహించని విధంగా ఇంగ్లాండ్ ఇలా ఆడడం నిజంగా ఇంగ్లాండ్ టీం కి భారీ దెబ్బ అనే చెప్పాలి.
ఇక ఈ టోర్నికి ముందు సెమీఫైనల్ కి వెళ్లే టీంల లిస్టులో ఇంగ్లాండ్ పేరు మొదట గా వినిపించేది కానీ ఇప్పుడు ఆ టీం అసలు ఏ మాత్రం విజయాలను అందుకోలేక చతికల పడిపోవడం తో టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది…