https://oktelugu.com/

Ashes 2023 ENG vs AUS : ఇంగ్లాండ్ ను వరుణుడే ఓడిస్తున్నాడా?

వరుణుడు రూపంలో ఇంగ్లాండ్ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. రెండు రోజుల్లో 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడిందంటే వర్షం ఎంతగా నాలుగో టెస్ట్ కు ఆటంకం కలిగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 23, 2023 / 09:14 PM IST
    Follow us on

    Ashes 2023 ENG vs AUS : యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండు విజయానికి వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. గడిచిన రెండు రోజుల నుంచి వర్షం పడుతుండడంతో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రెండు రోజుల నుంచి ఆట సాధ్యపడడం లేదు. ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఆట జరిగేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ టెస్ట్ డ్రా దిశగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వరుణుడు రూపంలో ఇంగ్లాండ్ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. రెండు రోజుల్లో 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడిందంటే వర్షం ఎంతగా నాలుగో టెస్ట్ కు ఆటంకం కలిగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

    యాషెస్ సిరీస్ లో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పట్టు బిగించినట్లు కనిపించింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టు ఈ టెస్ట్ లో దారుణంగా ఓటమిపాలవుతుందని అనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని చేరుకునేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. 100 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లాండ్ జట్టు నాలుగో టెస్టును డ్రా చేసుకోవడం, విజయం సాధించడం చాలా కష్టం. ఎందుకంటే రెండు రోజుల ఆట మిగిలి ఉన్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఈ పరిస్థితుల్లో ఉంది. సుమారు 180 ఓవర్లు మిగిలి ఉండగా ఆస్ట్రేలియాకు చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ దశలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ బౌలర్లకు 6 వికెట్ల తీయడం సులభంగానే కనిపించింది. దీంతో ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు సులభంగానే విజయం సాధిస్తుందనిపించింది. కానీ, అనూహ్యంగా నాలుగో రోజు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నుంచి ఇక్కడ వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. నాలుగో రోజు 30 ఓవర్ల ఆట మాత్రమే అయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టపోయి 111 పరుగులు చేసింది. ఐదో రోజు ఆట మిగిలి ఉండడంతో వర్షం తగ్గుముఖం పడితే మిగిలిన 5 వికెట్లు తీసి విజయం దిశగా పయనించాలని ఇంగ్లాండ్ భావించింది.

    అయితే ఐదో రోజు 3:30 (భారత కాలమానం ప్రకారం) కు ప్రారంభం కావలసిన మ్యాచ్ రాత్రి 8 గంటల వరకు వర్షం వల్ల ప్రారంభం కాలేదు. దీంతో ఐదో టెస్టు విజయంపై ఇంగ్లాండ్ జట్టు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదో రోజు రెండు సెషన్లు వర్షం వల్ల కోల్పోవాల్సి వచ్చింది. మిగిలిన ఒక సెషన్ కూడా ప్రారంభమవుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. దీంతో నాలుగో టెస్టు పూర్తిగా వర్షార్పణమైనట్లు అయింది. దీంతో ఈ టెస్ట్ లో సులభంగా గెలవాల్సిన ఇంగ్లాండు జట్టుకు వరుణుడు ఆటంకం కలిగించి ఆస్ట్రేలియాకు మేలు చేశాడు. దీంతో ఐదో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఏర్పడింది. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 317 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు 592 పరుగులు చేసింది. 275 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ జట్టు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఐదు టికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో రోజు మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. క్రీజులో మిచెల్ మార్స్ 31(107), కామెరూన్ గ్రీన్ 3(15) ఉన్నారు. ఈ సిరీస్ లో 2-1 తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వర్షమే ఇంగ్లండ్ కు అడ్డుగా ఉందని.. ఇంగ్లండ్ గెలవకుండా అడ్డుకుంటోందని.. సిరీస్ లో ఓడిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    https://twitter.com/englandcricket/status/1683047286664835072?s=20